ప్రకాష్‌రాజ్‌ సద్విమర్శనూ పాజిటివ్‌గా తీసుకోలేరా..!?

పవన్ కల్యాణ్ రాజకీయ గమనాన్ని..నిర్ణయాల్ని విమర్శించిన ప్రకాష్‌రాజ్‌పై.. పవన్ కల్యాణ్ క్యాంప్ భగ్గుమంది. జనసైనికులు ఎన్నెన్ని మాటలు ‌అన్నా.. జనసేనాని సోదరుడు నాగబాబు చేసిన విమర్శలు మాత్రం పరిగణనలోకి తీసుకోవాల్సినవే. కానీ ప్రకాష్‌రాజ్‌ను నాగబాబు వ్యక్తిగతంగా.. వ్యక్తిత్వ పరంగా దూషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు కానీ.. నాగబాబు రాజకీయంగా చేసిన సద్విమర్శపై సరైన స్పందన వ్యక్తం చేయలేకపోయారు. ప్రకాష్ రాజ్ చరిత్ర మొత్తం తెలుసని.. ఆయన ఎంతెంత మందిని ఇబ్బంది పెట్టారో కూడా తెలుసని.. నాగబాబు చెప్పుకొచ్చారు. కానీ అక్కడ విషయం ప్రకాష్ రాజ్.. నిర్మాతల్ని ఇబ్బంది పెట్టడం కాదు. అది వేరే సబ్జెక్ట్. ప్రకాష్ రాజ్ వ్యవహారశైలి అందరికీ తెలుసు. తెలిసే ఆయనకు సినిమాల్లో చాన్సిలిచ్చారు. అందుకే నడిచిపోతోంది.

కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ విమర్శలు చేసింది.. పవన్ కల్యాణ్ సినిమా కెరీర్ గురించి కాదు. ఆయన నడవడిక గురించి కూడా కాదు. కేవలం… రాజకీయ నిర్ణయాలనే ప్రశ్నించారు. నిజానికి ప్రకాష్ రాజ్ నోటి వెంట వచ్చిన విమర్శలు సాధారణ జన సైనికుల నోటి నుంచి వచ్చేవే. చాలా మంది తమ నేత నిర్ణయాలను గుడ్డిగా సమర్థించాలి కాబట్టి సమర్థిస్తూ ఉంటారు. కానీ మనసులో బాధపడుతూ ఉంటారు. అర్థం పర్థం లేని రాజకీయ నిర్ణయాలతో పవన్ కల్యాణ్ తాను గందరగోళ పడుతూ.. జన సైనికుల్ని గందరగోళ పెడుతున్నారన్నది నిజం. 2014లో ఏం చేశారు.. ఆ తర్వాత పాచిపోయిన లడ్డూల పేరుతో బీజేపీని ఏం అన్నారు..? అన్నీ అందరికీ గుర్తుంటాయి. 2019లో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. వెంటనే బిజేపీ గెలవగానే మళ్లీ బీజేపీతో పొత్తన్నారు. ఇలా చేయడం వల్ల చులకన అయింది పవన్ కల్యాణే. ఆ విషయం బీజేపీ ఇస్తున్న ట్రీట్‌మెంట్‌తోనే తెలిసిపోతోంది. ఆ ప్రకారం చూసుకుంటే.. ప్రకాష్ రాజ్ సద్విమర్శ చేశారనే చెప్పాలి.

ప్రకాష్ రాజ్ రాజకీయంగా పోటుగాడేం కాదు. ఆయన గొప్ప నటుడు కావొచ్చు కానీ రాజకీయాల్లో మాత్రం దూదిపింజే. ఆ విషయం గత ఎన్నికల్లోనే తేలిపోయింది. బీజేపీ భావజాలానికి విరుద్ధమైన మనస్థత్వంతో ఆయన మోడీపై నేరుగానే ఎటాక్ చేశారు. అదే భావజాలంతో ఎన్నికల బరిలోకి దిగారు. రాజకీయంగా కూడా..ఆయన గురించి ప్రజలు తీర్పు ఇచ్చారు. బెంగళూరులో ఎంపీ స్థానంలో పోటీ చేసి.. ఎక్కడో ఉన్నారు. కానీ ఆయన తన విధానాల్ని మార్చుకోలేదు. ప్రకాష్ రాజ్ రాజకీయ విమర్శలపై అలాగే నాగబాబు విమర్శిస్తే బాగుండేది కానీ.. కెరీర్ పరంగా.. వ్యక్తిత్వ పరంగా విమర్శలు చేయడం.. కరెక్ట్ అనిపించుకోదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశ్నలన్నీ వైఎస్ విజయలక్ష్మికే..!

వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు...

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

కొర‌టాల ద‌గ్గ‌ర క‌థే లేదా?

త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టైంది. ఆఘ‌మేఘాల మీద‌... ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. ఎన్టీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close