బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనది ఆటలో అరటి పండు పరిస్థితేనని ప్రశాంత్ కిషోర్ కు క్లారిటీ వచ్చేసింది. అదే విషయాన్ని స్ట్రాటజిక్ గా బయట పెడుతున్నారు. మీడియా ఇంటర్యూలు ఇస్తూ.. తనకు వస్తే 150 వస్తాయి లేకపోతే పది సీట్లు వస్తాయని చెప్పుకొస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకుని రెండు కూటములకు ప్రత్యామ్నాయం కోరుకుంటే తనకు ఏకపక్ష విజయం వస్తుందని లేకపోతే పది సీట్లు కూడా వస్తాయో లేదోనని చెబుతున్నారు.
అలాంటి పరిస్థితే వస్తే ఆ గెలిచిన వాళ్లుకూడా తనతో ఉండరని కూడా ఆయనకు క్లారిటీ ఉంది. వారు కూడా కేసుల కోసమే…డబ్బు కోసమో ఆశపడి పార్టీలు మారిపోవచ్చని..తాను వారిని అడ్డుకోలేంటున్నారు. ఎన్నికల్లో జనసురాజ్ పార్టీని అసలు పోటీగా చూడటం లేదని వస్తున్న విశ్లేషణలను కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అయితే అందులో వాస్తవం లేదని చెబుతున్నారు. తన పార్టీ రేసులో ఉందని… ప్రజల నిర్ణయాన్ని అంచనా వేయడం కష్టంగా ఉందని చెబుతున్నారు.
బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఏ కూటమితోనూ జట్టు కట్టలేదు. కింగ్ మేకర్ అవుతానని గట్టి నమ్మకంతో ఉన్నారు. తానుఎన్నికల్లో పోటీ చేయకపోవడం.. జనసురాజ్ పార్టీకి మైనస్ గా మారిందని.. అదే ఇబ్బందికరంగా మారిందన్న అంశంపైనా ఆయన నిరాశగానే సమాధానమిస్తున్నారు. పార్టీ గెలిచిందా లేదా అన్నది చూస్తారు కానీ.. పీకే గెలిచాడా లేదా అన్నది కాదని ఆయన కవర్ చేసుకుంటున్నారు. మొత్తంగా పీకే తాను ఎన్నికల విషయంలో తప్పటడుగులు వేశానని మాత్రం అర్థం చేసుకున్నారు.
