బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని అక్కడి రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి మాటల్ని అక్కడ ఉపయోగించుకుటున్నారు. కాంగ్రెస్ ను.. రాహుల్ గాంధీని కార్నర్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు . రాహుల్ బీహార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంటున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో బీహార్ అంశాలతో పోల్చి మాట్లాడేవారు. బీహార్ కు చెందిన ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం ఇస్తున్నారని బీహారీ పాలన అని గత ప్రభుత్వంలో ఆరోపించారు. అలాగే బీహార్ ప్రజలు కూలీలుగా పని చేస్తారని అన్నారు. ఈ మాటల్ని గుర్తు చేస్తున్న ప్రశాంత్ కిషోర్.. రాహుల్ గాంధీ బీహార్ కు ఎన్నికల ప్రచారానికి వచ్చే ముందు .. వివరణ ఇచ్చి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి బీహార్ తో పోలిక తెచ్చుకోవడం ఒక్క రేవంత్ కాదు.. అందరూ చేస్తారు. చివరికి ఏపీని బీహార్ లాగా చేశారని ఆరోపణలు , విమర్శలు ఎదుర్కొన్న జగన్ కూడా .. ఇటీవల చంద్రబాబుపై అదే విమర్శలు చేశారు. బీహార్ కన్నా ఘోరంగా శాంతిభద్రతలు దిగజారాయన్నారు. బీహార్ ను అందరూ ఓ వరస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తూంటారు. కానీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికి.. ప్రశాంత్ కిషోర్ కు రేవంత్ మాటలు ఉపయోగపడుతున్నాయి.