పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తమ ఆహ్వానాన్ని తిరస్కరించారని ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రధాన కార్యదర్శి పదవి తీసుకునేందుకు సిద్దమైన ఆయన చివరికి తన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సంబంధాలను వదులుకుని ఒక్క కాంగ్రెస్‌కే అంకితమయ్యేందుకు సిద్ధపడలేదు. దీంతో గౌరవంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీనే కాస్త చొరవ తీసుకుని ఆయనేపార్టీలో చేరనన్నారని ప్రకటించేసుకుంది. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఓపెద్ద బ్లూప్రింట్ తయారుచేసి ఇచ్చారు. తాను పార్టీలో ఉంటే చురుగ్గా అమలు చేయగలుగుతామని నమ్మకం కలిగించారు.
అయితే తన ఐ ప్యాక్ మాత్రం దేశంలో ఒప్పందం చేసుకున్న అన్ని పార్టీలకు పని చేస్తుందని ఆయన తేల్చేశారు. దీంతో పీకే కాంగ్రెస్‌లో చేరి కూడాఇతర పార్టీలకు పని చేస్తే అంత కంటే భావదారిద్ర్యం మరొకటి ఉండదని భావించారు. అదే కాంగ్రెస్‌లో రకరకాల చర్చలకు కారణం అయింది. చివరికి ఉభయతారకంగా పీకే రిపోర్టు చూసి కాంగ్రెస్‌లోకి సోనియా ఆహ్వానించారని..కానీ ఆయననేరుగా రాజకీాయాల్లోకి రాకుండా..సలహాదారుగా మాత్రమే ఉంటామన్నారని ప్రకటించారు.
ఇప్పటికైతే కాంగ్రెస్ కు పీకే గండం తప్పిపోయినట్లయింది. కాంగ్రెస్‌లో ఆఫర్‌ను తిరస్కరించేంత సీన్ పీకేకు లేదని గతంలో ఆయన జేడీయూలో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.బీహార్ రాజకీయాల్లోనే ఓ చిన్న పాత్ర కోసం ఆయన సిద్ధపడ్డారు..కాంగ్రెస్‌లో ప్రధన కార్యదర్శి పదవి ఎందుకు వద్దంటారని అంటున్నారు. మొత్తంగా పీకేను కాంగ్రెస్ వదిలించుకుందో.. కాంగ్రెస్ ను పీకే వదిలించుకున్నారో కానీ ఇప్పటికే… ఈ పీకే కాంగ్రెస్ ఎపిసోడ్‌కు తెరపడినట్లయింది.