ప్ర‌శాంత్ నీల్‌ని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేనా?

‘కేజీఎఫ్‌’ త‌ర‌వాత‌.. ప్ర‌శాంత్ నీల్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఎన్టీఆర్‌ని క‌లిశాడ‌ని, మ‌హేష్‌కి క‌థ చెప్పాడ‌ని, ప్ర‌భాస్ తో సినిమా చేస్తాడ‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు. మైత్రీ మూవీస్ ప్ర‌శాంత్ నీల్ ని లాక్ చేసుకోవ‌డం, ఎన్టీఆర్ తో సినిమా ఒప్పించ‌డం వ‌ల్ల ప్ర‌శాంత్ – ఎన్టీఆర్ కాంబో… సెట్ట‌యిపోయింది. కాక‌పోతే.. వార్త‌లు మాత్రం ఆగ‌లేదు. ఈమ‌ధ్యే.. ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ కాంబో ఓకే అయిపోయింద‌ని… క‌న్న‌డ సీమ‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. అక్క‌డ మీడియా అంతా ఈ కాంబోపై ఫోక‌స్ పెట్టింది. ప్ర‌శాంత్ నీల్ తీసిన `ఉగ్రం`కి ఇది రీమేక్ లాంటిద‌ని చెప్పుకొచ్చారు.

కానీ.. ఇంత‌లోనే… ప్ర‌భాస్ ఈ కాంబో లేద‌ని ప‌రోక్షంగా తేల్చేశాడు. `ఆది పురుష్‌` సినిమాని ప్ర‌క‌టించిన ప్ర‌భాస్, రూమ‌ర్ల‌కు ప‌రోక్షంగా చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ప్రభాస్‌- ప్ర‌శాంత్ కాంబో సెట్ అవ్వ‌డం… దాదాపు కుద‌ర‌ని ప‌ని. ఎందుకంటే.. ప్ర‌భాస్ చేతిలోని సినిమాలు పూర్త‌య్యే స‌రికి మ‌రో నాలుగేళ్ల‌యినా ప‌డుతుంది. ఈలోగా.. చాలా మార్పులొచ్చేస్తాయ్‌. `ఆది పురుష్‌` ఓకే అయిపోవ‌డంతో.. ప్ర‌శాంత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టొచ్చు. ప్ర‌శాంత్ అనే కాదు.. ప్ర‌భాస్ కోసం క‌థ‌లు రెడీ చేస్తున్న‌వాళ్లంతా ఇప్పుడు ప్ర‌త్యామ్నాయ మార్గాల్ని అన్వేషించుకోక త‌ప్ప‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

జనసేనను ప్లాన్డ్‌గా తొక్కేస్తున్న బీజేపీ..!?

భారతీయ జనతా పార్టీ వ్యూహం .. జనసేనను ప్లాన్డ్‌గా..తొక్కేయడమేనని పెద్దగా ఆలోచించకుండా జనసైనికులకు ఆర్థం అవుతోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లను బీజేపీ తెచ్చుకుంది. ఆరు శాతం ఓట్లను వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close