బాలయ్య కోసం కొత్త ప్ర‌పంచం సృష్టిస్తాడ‌ట‌

అ, క‌ల్కి, జాంబిరెడ్డి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హను-మాన్ రూపొందిస్తున్నాడు. తేజా స‌జ్జా క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఈలోగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేసే ఆఫ‌ర్ అందుకొన్నాడు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘అన్ స్టాపబ‌బుల్‌’కి ప్ర‌శాంత్ వ‌ర్మ‌నే ద‌ర్శ‌కుడు. ఆ షో బాగా పాపుల‌ర్ అయ్యింది. అందుకే.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌కి బాల‌య్య ఆఫ‌ర్ ఇచ్చాడు. బోయ‌పాటి శ్రీ‌నుతో సినిమా పూర్త‌య్యాక ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ల‌న్నీ కొత్త స్టైల్ లో ఉంటాయి. ప్ర‌తీ సినిమా.. ఓ కొత్త జోన‌ర్‌లో సాగుతుంటుంది. మ‌రి బాల‌య్య సినిమా ఎలా ఉండ‌బోతోంది? ఈ సినిమా కోసం ప్రశాంత్ వ‌ర్మ ఏం చేయ‌బోతున్నాడు? అనే ఆస‌క్తి నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా బాల‌య్య సినిమా గురించి కొంత స్ప‌ష్ట‌త ఇచ్చాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ”ఈ సినిమా నా స్టైల్ లో కొంత‌.. బాల‌య్య గారి స్టైల్‌లో కొంత ఉంటుంది. ఆయ‌న రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ క‌థ‌లతో పాటు అన్ని ర‌కాల క‌థ‌లూ చేసేశారు. అందురు రౌడీల‌నూ కొట్టేశారు. ఆయ‌న చేయ‌నిదేదో ఈ క‌థ‌లో చూపించాలి. ఓ కొత్త ప్రపంచం సృష్టించాలి. అందుకు త‌గిన క‌థ కూడా సిద్థం చేస్తున్నా. బేసిక్ ఐడియా కూడా ఆయ‌న‌కు చెప్పేశా. దానిపై వ‌ర్క్ చేయాలి” అంటూ క్లారిటీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను ఓ పావుగా వాడుకుంటున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన

నటి పూనమ్ కౌర్ ఈమధ్య కాలంలో చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. రాజకీయ దుమారం రేపాయి. పూనమ్ ఓ పార్టీలో చేరబోతుందని, ఆ పార్టీకి అనుకూలమైన ట్వీట్స్ చేస్తోందని కొన్ని కథనాలు వచ్చాయి....

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close