ఏపీ సీఎంవోలో వన్ అండ్ ఓన్లీ ప్రవీణ్ ప్రకాష్..!

నేను ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అని ఓ సినిమాలో రజనీకాంత్ అంటాడేమో కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. ఒక్క సారి చెబితే వెయ్యి సార్లు చెప్పినట్లు. ఇప్పటి వరకూ సీఎంవోలో ఆయన చాలా పవర్‌ఫుల్ అని అందరికీ తెలుసు కానీ.. తొలి సారి.. ఇతర సలహాదారుల రెక్కలు పూర్తిగా విరిచేసి.. ఆ బలాన్ని ప్రవీణ్ ప్రకాష్‌కు కట్టబెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కీలకమైన శాఖల పర్యవేక్షణ మొత్తం ఆయనకే ఇచ్చారు. ప్రవీణ్ ప్రకాష్ మాటే సీఎం మాట అనే విధంగా.. స్పష్టమైన సంకేతాన్ని పంపారు.

అజేయకల్లాం ఇక సలహాలివ్వలేని సలహాదారు మాత్రమే..!

చంద్రబాబు హయాంలో సీఎస్‌గా పని చేసి.. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాంప్‌లో చేరి.. మేధావి పేరుతో.. ఎన్నికలకు ముందు వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి.. తాను పని చేసిన ప్రభుత్వంపైనే భారీ అవినీతి ఆరోపణలు చేసిన కల్లాం అజేయరెడ్డి .. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య సలహాదారు పదవి పొందారు. ఆయనకు హోం శాఖ సహా పలు కీలకమైన శాఖలు ఇచ్చారు. దీంతో.. కల్లాం అజయ్‌రెడ్డి గుడ్‌లుక్స్‌లో పడేందుకు అధికారులు పోటీపడేవారు. ఇప్పుడు… ఆయన అధికారాలు.. శాఖలు మొత్తం కట్ అయిపోయాయి. సలహాదారు అనే పదవి మాత్రం ఉంది. ఏ విషయంలో సలహాలివ్వాలో మాత్రం..ఆయనకి క్లారిటీ లేదు. ప్రభుత్వం కూడా చెప్పలేదు.

పీవీ రమేష్‌కూ అదే పరిస్థితి..!

ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహిత అధికారిగా పేరున్న మరో అధికారి పీవీ రమేష్‌కు కూడా.. ఇలాంటి పరిస్థితే ఎదురయింది. ఎన్నికలు జరిగిన సమయంలో.. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన.. ఢిల్లీ స్థాయిలో వైసీపీ గెలుపు కోసం.. కొన్ని పనులు చక్క బెట్టారు. ఆ తర్వాత ఆయనను.. ఏపీకి తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో రిటైరైనప్పటికీ.. ప్రత్యేకంగా పదవి సృష్టించి కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయనను కూడా సలహాదారు పదవికే పరిమితం చేశారు. ఏ శాఖకు సలహాలివ్వాలో కూడా చెప్పలేదు. అంటే… ఆయనకూ కల్లాం అజేయరెడ్డి లాంటి పరిస్థితే ఎదురయిందన్నమాట. ప్రవీణ్ ప్రకాష్‌తో పాటు సీఎంవోలో సాల్మన్ ఆరోఖ్యరాజ్, ధనుంజయ్ రెడ్డి ఇతర శాఖలు చూసుకుంటారు. వీరిద్దరూ కూడా.. ప్రవీణ్ ప్రకాష్ కనుసన్నల్లో పని చేస్తారు.

జగన్ మైండ్‌సెట్‌కు తగ్గట్లుగా ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం..!

ప్రవీణ్ ప్రకాష్… అనూహ్యంగా సీఎంవోలోకి వచ్చారు. మొదట్లో ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉండేవారు. ఢిల్లీలో జరిగిన శ్రీవారి కల్యాణోత్సవంలో నిధులు గోల్ మాల్ అయ్యాయంటూ టీటీడీ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఈ విషయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి.. టీటీడీ తరపున బాధ్యతలు చూసే పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆయన నేరుగా సీఎంవోలోకి వచ్చారు. వచ్చినప్పటి నుండి ఆయన పనితీరు బాగా నచ్చిందేమో కానీ.. జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తూ వెళ్లారు. జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా ప్రవీణ్ ప్రకాష్.. వ్యవహరిస్తూ.. రూల్స్ మాట్లాడబోయిన ఇతర అధికారులపై .. ముఖ్యమంత్రి దృష్టిలో రిమార్కులు పడేలా చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో… ప్రవీణ్ ప్రకాష్.. ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ అన్నట్లుగా మారిపోయారని అంటున్నారు. కల్లాం అజేయరెడ్డిపై జగన్ కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనను తప్పిస్తారని ఆరు నెలలుగా చెబుతున్నారు. ఇప్పుడు అది నిజం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close