రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు జరుగుతున్న లావాదేవీలలో సగం రీ సేల్ ప్రాపర్టీలే ఉంటున్నాయి. రీసేల్ అపార్టుమెంట్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మొదట అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన టైటిల్ క్లియర్‌గా ఉందని నిర్ధారించుకోవాలి. టైటిల్ డీడ్, సేల్ డీడ్, లేదా రిజిస్ట్రేషన్ పత్రాలను తనిఖీ చేయండి. ఎలాంటి లీగల్ డిస్ప్యూట్లు లేవని లీగల్ నిపుణుడు లేదా లాయర్ ద్వారా ధృవీకరించుకోవాి. గత 12–15 సంవత్సరాల ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికేట్‌ను సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి పొంది, ఆస్తిపై ఎటువంటి రుణాలు, మార్ట్గేజ్లు లేదా లీగల్ సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. అపార్ట్మెంట్ ఉన్న ప్రాజెక్ట్ RERA లో రిజిస్టర్ అయితే ప్రాజెక్ట్ వివరాలను ఆన్లైన్లో వెరిఫై చేయవచ్చు. బిల్డర్ లేదా అసోసియేషన్ నుండి NOC తీసుకోవాలి.
రీసేల్ అపార్ట్మెంట్ సాధారణంగా పాతదై ఉంటుంది. నిర్మాణ నాణ్యత, ఉపయోగించిన మెటీరియల్స్, భవనం యొక్క నిర్వహణ స్థితిని తనిఖీ చేయండి. లీకేజీలు, పగుళ్లు, లేదా స్ట్రక్చరల్ సమస్యలు ఉన్నాయేమో చూడండి. అపార్ట్‌మెంట్‌ను స్వయంగా సందర్శించి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వంటివాటిని చెక్ చేయాలి.
రీసేల్ ఫ్లాట్‌కు బ్యాంక్ లోన్ అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి. కొన్ని పాత ఆస్తులకు బ్యాంకులు లోన్ ఇవ్వకపోవచ్చు.
రీసేల్ అపార్ట్మెంట్లలో ధరలు సాధారణంగా బేరసారాలకు అనుకూలంగా ఉంటాయి. సెల్లర్తో చర్చించి, మార్కెట్ ధరల ఆధారంగా 5–10% డిస్కౌంట్ కోసం ప్రయత్నించవచ్చు. రీసేల్ అపార్ట్మెంట్ కొనుగోలు సురక్షితంగా , ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.