దేశంలో ఉండమని మోదీకి చెప్పండర్రా…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ ముహూర్తంలో పదవీబాధ్యతలు స్వీకరించారోగానీ, కాళ్లకు చక్రాలు కట్టుకుని ఒకదేశం తర్వాత మరో దేశం తిరుగుతూనే ఉన్నారు. 2014 నుంచి మోదీ ఇప్పటివరకు (నంవబర్ వరకు) 36సార్లు విదేశీ పర్యటనల్లో పాల్గొన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయగానే విదేశీ టూర్లు మొదలుపెట్టారు. 2014లో తొమ్మిది విదేశీపర్యటనలు తనఖాతాలో జమచేసుకున్న మోదీ, 2015లో ఇప్పటికే 24 సార్లు విదేశీ విమానాలు ఎక్కేశారు. ఇంకా ఈఏడాదిలో మరో రెండు విదేశీ పర్యటనలు బాకీ ఉన్నాయి.

దేశంలో ఎన్నో కీలకమైన సమస్యలుండగా ప్రధాని మోదీ ఒకదానివెంట మరొకటిగా విదేశీ పర్యటనలకు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. 2014లో మోదీ ఎన్నికల్లో గెలిచారా? లేక విదేశీ టూర్ ప్యాకేజీ పోటీలో గెలిచారా? అన్న సందేహం కలగకమానదు. దేశంలో అసహనం పెరిగిపోతున్నా, కందిపప్పు ధర 200 రూపాయలకు చేరుకుంటున్నా, సామాన్య జనజీవితం అస్తవ్యస్థమవుతున్నా ఘనమైన మోదీగారికి పట్టడంలేదు. ఆయనగారు భారతదేశపు 125కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి అనుకోవడంలేదు. ఇండియాని ఓ కంపెనీగా భావిస్తూ దానికి సీఈఓగా అనుకుంటున్నారు. ఫక్తు వ్యాపారలావాదేవీలతో గుజరాతీ వ్యాపారీగా సాగిపోతున్నారు.

ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళడం తప్పుకాదు. గతంలో కూడా ప్రధానమంత్రిగాఉన్నవారు విదేశీపర్యటనలకు వెళ్ళారు. అయితే, అంతర్జాతీయ కూటమి సమావేశాల్లో (బ్రిక్స్, జి-20, ఈఏఎస్, ఎస్ సీఓ, ఐబీఎస్ ఏ, సార్క్ వంటి సమావేశాల్లో) పాల్గొనడానికి వెళ్లడం మంచిదే. అక్కడ భారతవాణి ప్రపంచదేశాలకు వినిపించడం అనివార్యమే. దీన్ని ఎవ్వరూ తప్పుబట్టలేరు. అయితే మోదీ వెళుతున్న విదేశీ పర్యటనల్లోని ప్రధాన లక్ష్యం ఆయా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంగానే ఉంది. ఇది కూడా అవసరమైనదే. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఆర్థికంగా ఆదుకునే అవకాశాలను అన్వేషించడం అవసరమైనదే. కాకపోతే గతంలో ఇలాంటి విదేశీ పర్యటనలను విదేశాంగ శాఖ మంత్రి గానీ, లేదా ఆర్థికశాఖమంత్రిగానీ తరుచుగా వెళుతుండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ప్రతిచోటుకీ ప్రధాని మోదీనే స్వయంగా వెళ్ళివస్తున్నారు. కొన్ని దేశాలకైతే ప్రధాని రెండుసార్లు ఇప్పటికే వెళ్ళివచ్చారు. 2014లో ఆయనగారి పర్యటనల జాబితా చూస్తే, నేపాల్ కు రెండుసార్లు వెళ్లారు. ఆగస్టులో ఒకసారి, నవంబర్ లో మరోసారి మోదీ నేపాల్ వెళ్ళివచ్చారు. ఇక అమెరికాకు 2014లో ఒకసారి, 2015లో మరోసారి వెళ్ళివచ్చారు. సింగపూర్ లో కూడా 2015 మార్చిలోనూ, తిరిగి నవంబర్ లోనూ పర్యటించారు. ఇప్పటికే ఆయనగారు చేసిన విదేశీ పర్యటనలతో వరల్డ్ మ్యాప్ తయారుచేసి చూస్తే, ఆయనగారి విశ్వరూపం ఏ స్థాయిలో ఉన్నదో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

దేశాన్ని ఆర్థికంగా సంపన్నం చేయడంకోసం ప్రధాని మోదీ బాగానే కష్టపడుతున్నారు. ఈ రకంగా ఆయన రికార్డు కూడా సృష్టిస్తున్నారు. త్వరలోనే 50 విదేశీ పర్యటనలను పూర్తిచేసుకోబోతున్నారు. ఇదంతా బాగానేఉంది. కానీ దేశంలో ప్రజల అవసరాల గురించి పట్టించుకోకుండా, విదేశాలు పట్టుకుతిరిగుతుంటే ఎలా? విదేశీరంగుల కలలో విహరిస్తున్న మోదీని ఎవరు నేలమీదకు దింపేది? ప్రధాని మోదీ పారదర్శక పాలన అందిస్తున్నారన్నది నిజమే. ఆల్ ఇండియా రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనడమేకాదు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన http://pmindia.gov.in అనే వెబ్ సైట్ ని ఏర్పాటుచేసుకుని, అందులో ఇంటరాక్ట్ విత్ పీఎం అనే ఆప్షన్ ఉంచారు. http://pmindia.gov.in/en/interact-with-honble-pm ద్వారా ఎవరైనా ఎంటరై వారి అభిప్రాయాలను ఆలోచనలను షేర్ చేయవచ్చు.

మోదీకి కొన్ని సూచనలు

అయ్యా, మోదీగారు, మీరు విదేశీ పర్యటనలను తగ్గించుకుని దేశప్రజలకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండాలి.

ఇలాగే ఎక్కవకాలం విదేశీయాత్రలతో గడపాలనే మీరు కచ్చితంగా నిర్ణయించుకునే పక్షంలో దేశంలోని ప్రజల సమస్యలు పట్టించుకునేందుకు ఉప-ప్రధానమంత్రిని నియమించండి.

అలా నియమించే ఉప ప్రధానమంత్రి కేవలం తోలుబొమ్మలా కాకుండా మీ బదులుగా కీలకనిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వాలి.

ఇండియాను మార్కెట్ చేయడంలో మీకుమీరేసాటి. కాకపోతే ఎక్కడోఅక్కడ ఫుల్ స్టాప్ పెట్టి పేపర్ ప్రాజెక్టులను నిజం చేయడానికి నడుం బిగించాలి.

మీపట్ల ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం సడలకుండా చూసుకోండి. ప్రతి విషయంలోనూ మీ ప్రమేయం ఉండాలనుకోవడం మంచిదికాదు. ఏకవ్యక్తి పాలనక్రింద ఈ దేశం ఉన్నదన్న భావనను కలిగించకండి.

ఆలోచనలు మంచివికావచ్చు, ఆచరణలో చిత్తశుద్ధి ఉండవచ్చు. కానీ 125కోట్ల ప్రజల మనోభావాలు గుర్తెరిగి ప్రవర్తించండి. లేకపోతే 2019 ఎన్నికల్లో మీరు మీ జట్టు బోల్తాకొట్టడం ఖాయం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close