గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అమెరికా నుంచి ఓ ఐటీ కంపెనీని గుడివాడకు తీసుకు వచ్చారు. ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ కంపెనీ గుడివాలో వంద మంది ఉద్యోగులతో దసరా రోజున ఓ ఆఫీసు ప్రారంభించింది. ఈ కార్యాలయం సక్సెస్ కావడం.. మీద గుడివాడ విజయం ఆధారపడి ఉంటుందని వెనిగండ్ల రాము అన్నారు.
వంద మంది ఉద్యోగుల్ని ప్రిన్స్టన్ సంస్థ నియమించుకోబోతోంది. ఈ మేరకు మూడు రోజుల పాటు వాక్ ఇన్ ఇంటర్యూలు నిర్వహించబోతున్నారు. గుడివాడ ఆ చట్టుపక్కల వారికి ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. తెలుగు వారిదే అయిన ఆ కంపెనీ సాహసోపేతంగా గుడివాడలో కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
వెనిగండ్ల రాము స్వయంగా ఎన్నారై.తనకు ఉన్న పరిచయాలతో.. వీలైనంత వర్క్ ను ఔట్ సోర్స్ చేసేలా.. గుడివాడలో కార్యాలయాలు ఏర్పాటుచేసేలా కంపెనీలను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రిన్స్టన్ ప్రయత్నం సక్సెస్ అయితే.. చిన్న చిన్న పట్టణాల్లో రిమోట్ ఆఫీసులు పెట్టడానికి ఇతర కంపెనీలు కూడా ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి.