ప్ర‌భాస్ టైటిల్ వాడుకొంటున్నారా?

హాస్య న‌టుడు ప్రియ‌ద‌ర్శి హీరోగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. న‌భా న‌టేషా క‌థానాయిక‌. ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే పేరు పెట్టే ఆలోచ‌న‌లో ఉంది చిత్ర బృందం. ప్ర‌భాస్ ఊత‌ప‌దం ‘డార్లింగ్‌’. ఈ పేరుతో క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా కూడా చేశారు. మ‌ళ్లీ ఇదే టైటిల్ వాడుకోవాల‌ని చిత్ర‌బృందం చూస్తోంది. అందుకోస‌మే న‌భా న‌టేషా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్ర‌భాస్ డార్లింగ్ అనే డైలాగ్ ని రీల్ రూపంలో వాడి, దాన్ని అభిమానుల‌తో పంచుకొంది. స‌డ‌న్‌గా న‌భా ప్ర‌భాస్‌ని ఎందుకు ఇమిటేట్ చేస్తోందో, ముందు అభిమానుల‌కు అర్థం కాలేదు. ఆ త‌ర‌వాత‌… ప్రియ‌ద‌ర్శి ట‌చ్‌లోకి వ‌చ్చి, న‌భాతో కాసేపు సోష‌ల్ మీడియాలో చిట్ చాట్ లాంటిది చేశాడు. అలా.. ఈ వీడియో సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రూపొందించిందన్న విష‌యం అర్థ‌మైంది.

న‌భా ఆమ‌ధ్య బాగా డ‌ల్ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ సూప‌ర్ హిట్ట‌యినా, అవ‌కాశాల్ని అందుకోలేక‌పోయింది. ఇప్పుడు మ‌ళ్లీ పుంజుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉంది. నిఖిల్ క‌థానాయ‌కుడిగా రూపుదిద్దుకొంటున్న ‘స్వ‌యంభూ’లో న‌టిస్తోంది. ప్రియ‌ద‌ర్శి సినిమా కూడా చేతిలో ఉంది. ఇది కాకుండా మ‌రో రెండు ఆఫ‌ర్లు రెడీగా ఉన్నాయ‌ని టాక్. వాటి గురించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో న‌భా నే చెబుతుంద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close