మహేశ్‌బాబు, రాజమౌళి సినిమా సర్ప్రైజులైన్నీ సైలెంట్ గా వచ్చేస్తున్నాయి. ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ తో పాటు సంచారి పాటని సైలెంట్ గా వదిలేశారు. ఇందులో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ఇప్పుడు రివిల్ చేశారు.
ఈ చిత్రంలో ప్రియాంక మందాకిని పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌లుక్‌లో ప్రియాంక చీరకట్టులో గన్ పేలుస్తూ యాక్షన్ అవతార్ లో కనిపించింది. ”దేశీ గర్ల్ మళ్లీ వచ్చేసింది. ‘మందాకిని’ లో డిఫరెంట్ షేడ్స్ చూడటానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది’’ అంటూ రాజమౌళి ఓ పోస్ట్ కూడా పెట్టారు.
ప్రియాంక లుక్ నిజంగా సర్ ప్రైజ్. ఇప్పటివరకూ ఈ సినిమా థీమ్ గురించి అనేక చర్చలు జరిగాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ వచ్చిన తర్వాత మైథాలజీ సైన్స్ ఫిక్షన్ అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ప్రియాంక ని చీరకట్టులో పరిచయం చేసిన కొత్త ట్విస్ట్ ఇచ్చారు జక్కన్న. ప్రియాంక లుక్ చూసిన తర్వాత కథపై మరింత క్యురియాసిటీ పెరిగిపోయింది.
నవంబర్ 15న ఈ సినిమాకి సంబధించిన గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఈవెంట్లో #SSMB29 ఈ సినిమా టైటిల్‌తో పాటు, స్పెషల్ వీడియోను విడుదల చేసే అవకాశం వుంది.


