ఔను.. రాజకీయం చేయాల్సిందే..! రాహుల్, ప్రియాంకలా చేయాల్సిందే..!

హత్రాస్ దారుణ అత్యాచార ఘటన .. ఢిల్లీ నిర్భయ ఘటన కంటే సంచలనాత్మకం అవుతుంది. రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. డిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు… కేంద్ర ప్రభుత్వం .. ప్రతిపక్షాల నిరసనల మీద ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. అందరితో పాటు తాను కూడా ఆందోళన చెందింది. బాధితురాల్ని సింగపూర్‌కు తీసుకెళ్లి చికిత్స అందించి అయినా కాపాడాలని ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా ఆ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిఫలంగానే నిర్భయ చట్టం వచ్చింది.కానీ ఆ చట్టం వచ్చినా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని.. ఆ తర్వాత నమోదవుతున్న కేసులను బట్టే తెలుస్తోంది. కానీ ఇప్పుడు హత్రాస్ ఘటనలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. ఆ ఘటనను వీలైనంతగా లో ప్రోఫైల్‌గా మార్చేసి.. ప్రతిపక్షాల పోరాటాలన్ని వీలైనంతగా తొక్కేస్ ప్రయత్నం చేస్తోంది.అయితే రాజకీయాల్లో ఎంతగా అణిచివేస్తే.. ఆ వ్యవహారం అంతగా పెరిగిపోతుంది. ఇప్పుడు హత్రాస్ వ్యవహారంలో అదే జరుగుతోంది.

వాళ్లూ మనుషులేగా..!?

హత్రాస్ బాధితురాల్నిఅత్యంత దారుణంగా హత్యాచారం చేయడమే కాదు.. సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకా అన్నట్లుగా అర్థరాత్రి పూట.. కుటుంబసభ్యుల చివరి చూపునకు కూడా నోచుకోకుండా చేసి ఆమెకు దహనసంస్కారాలు చేసేశారు. ఇక్కడే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దోషిగా దొరికిపోయింది. ఆ తర్వాత తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు. బాధిత కుటుంబసభ్యులను ఎవరూ పరామర్శించకూడదన్నట్లుగా పరిస్థితిని మార్చేశారు. ఎంత దారుణం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను కూడా నడిరోడ్డుపై నిలబెట్టేశారు. రాహుల్ గాంధీని నెట్టేశారు. ప్రియాంకతో కూడా దారుణంగా ప్రవర్తించారు. ఇదంతా నియంత స్వామ్యంలా కనిపించడంతో ప్రజల్లో కూడా కదలిక ప్రారంభమయింది. దీంతో ప్రభుత్వానికి కాళ్లూ, చేతులూ ఆడని పరిస్థితి ఏర్పడింది.

రాహుల్, ప్రియాంక భరోసాతో వాళ్లకి ధైర్యంం..!

బాధితురాలి కుటుంబసభ్యుల పరామర్శ కోసం ప్రియాంక, రాహుల్ ఓ రకంగా సాహసం చేశారు. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో.. తమ వెంట ఎవర్నీ అనుమతించకపోయినా.. స్వయంగా కారు నడుపుకుంటూ వారిద్దరూ హత్రాస్ వెళ్లారు. బిక్కుబిక్కుమంటున్న బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. అప్పటి వరకూ బిగబట్టుకున్న వారి కన్నీళ్లు.. రాహుల్, ప్రియాంకల ఓదార్పు తర్వాత ఒక్క సారిగా ఉబికి వచ్చాయి. వారు ఈ ఘటన తర్వాత ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఎలా ఉందో ఆ కన్నీళ్లు నిరూపించాయి. ఒకరు డబ్బుతో సెటిల్ చేశామంటారు.. మరొకరు రేప్ జరగలేదని వాదిస్తారు. ఇలా.. ఎన్నో.. ఎన్నో వికారాల మధ్య అన్యాయమైపోతున్న హత్యాచార బాధితురాలి కుటుంబానికి రాహుల్, ప్రియాంక అండగా నిలిచారు.

అవమానాలు ఎదురైనా ప్రజా రాజకీయమే చేయాలి..!

రాహుల్, ప్రియాంకది రాజకీయ పోరాటమే. రాజకీయం అంటే తప్పు అనుకునే పరిస్థితిని ఇప్పుడు తీసుకు వచ్చారు. రాజకీయ నాయకులు అంటే దారుణాలు చేసేవారు అనే అర్థాన్ని తీసుకు వచ్చారు. కానీ రాజకీయం అంటే ప్రజల కోసం చేసేది. వారి మేలు కోసం చేసేది. అలాంటి రాజకీయాన్ని ఇప్పుడు, రాహుల్ ప్రియాంక చేస్తున్నారు. చేయాలి కూడా. హత్రాస్ లాంటి ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కదలిక రావాలి.. అలా వచ్చినప్పుడే.. మళ్లీ మళ్లీ అలా జరగకుండా.. ఏదో ఓ ప్రయత్నం అయితే జరుగుతుంది. నిర్భయ చట్టం అలాగే వచ్చింది. దేశంలో కొన్ని కీలకమైన మార్పులు.. ప్రజా ఉద్యమాలతోనే వచ్చాయి. ప్రజల్లో కదలిక లేనంత వరకూ.. వారి కోసం పోరాడేవారికి భంగపాటు కలుగుతూనే ఉంటుంది. అలా కలిగినంత కాలం ప్రజలు నష్టపోతూనే ఉంటారు. అవమానాలు ఎదురైనా.. రాహుల్, ప్రియాంక… తమను ఓడించిన యూపీ ప్రజలకు ఏమైతే మాకేం అని అనుకోలేదు. ధైర్యం చెప్పేందుకు ముందుకే వెళ్లారు. అందుకే.. రాహుల్, ప్రియాంక తరహా రాజకీయమే చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close