పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రకటన వెలువడినప్పటి నుంచే అటు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ అంచనాలు తారస్థాయికి చేరాయి. మొన్న వచ్చిన సాంగ్ కూడా క్రేజ్‌ను అమాంతం పెంచింది. సెప్టెంబర్ 25న సినిమా వస్తుంది. నిర్మాతలు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. ఇప్పటివరకూ ఆమె లుక్ బయటికి రాలేదు. ఇప్పుడు కన్మణిగా ఆమెను పరిచయం చేశారు. ట్రెడిషనల్ లుక్‌లో అందంగా కనిపించింది ప్రియాంక. త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తారు.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఓజీ’లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరకి వస్తుండటంతో ఇక రెగ్యులర్ అప్డేట్స్తో సందడి చేయడానికి టీం ప్లాన్ చేస్తోంది. ఓజీ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు.. పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్‌ను నెవర్ బిఫోర్ లుక్‌లో ప్రజెంట్ చేయడం అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఈ ఏడాది బాక్సాఫీసును షేక్ చేయగల సత్తా ఉన్న చిత్రాల్లో ఓజీ ఒకటి.