షాకింగ్‌: ‘సైరా’ కి మ‌రో నిర్మాత‌?

చిరంజీవి 151వ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’కి రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చిరు తొమ్మిదేళ్ల త‌ర‌వాత రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’కీ చ‌ర‌ణే నిర్మాత‌. ఆ సినిమాలో నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్‌కి బాగానే గిట్టుబాటు అయ్యింది. అందుకే ‘సైరా’ బాధ్య‌త‌నీ తానే తీసుకున్నాడు. ఈ సినిమా మొద‌లెట్టేట‌ప్పుడు బ‌డ్జెట్ వంద కోట్లే అనుకున్నారు. కానీ అంచ‌నాల‌తో పాటు అంకెలూ పెరిగాయి. పేరున్న టెక్నీషియ‌న్లు, న‌టులు వ‌చ్చి చేర‌డం, చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం అవుతుండ‌డం, వ‌ర్కింగ్ డేస్ పెరుగుతుండ‌డంతో బ‌డ్జెట్ కూడా పెరుగుతూ పోయింది. ఇప్పుడు ‘సైరా’ బ‌డ్జెట్ రూ.200 కోట్ల ద‌గ్గ‌ర ఆగింది. రూ.200 కోట్లు పెట్ట‌గ‌లిగే స‌త్తా చ‌ర‌ణ్‌లో ఉంది. ఆ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. కాక‌పోతే.. ఇప్పుడు చ‌ర‌ణ్ మ‌రో నిర్మాత స‌హ‌కారం తీసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. ఆయ‌నే డి.వి.వి. దాన‌య్య‌. చ‌ర‌ణ్ – బోయ‌పాటి చిత్రానికి దాన‌య్య నిర్మాత‌. ఆయ‌న సైడ్ నుంచి ‘సైరా’కి పెట్టుబ‌డి పెడుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే ‘సైరా’ బిజినెస్ మొద‌ల‌య్యాక ఆ డ‌బ్బుల్ని తిరిగి ఇచ్చేస్తారా, లేదంటే… పెట్టుబ‌డిలో భాగంగా చూస్తున్నారా?? అనేది మాత్రం ఇంకా తేలాల్సివుంది. చ‌ర‌ణ్ అనుకోవాలే గానీ… ‘సైరా’ బిజినెస్ క్ష‌ణాల్లో పూర్త‌వుతుంది. ఆ డ‌బ్బుతో సినిమాని ఆడుతూ పాడుతూ లాగించేయొచ్చు. కానీ చ‌ర‌ణ్ ఉద్దేశం వేరు. సినిమా పూర్తయ్యాక‌… పాట‌లూ, ట్రైల‌రూ బ‌య‌ట‌కు వ‌స్తే.. ఈసినిమా రేంజు అర్థ‌మైతే.. రేట్లు పెరుగుతాయి. అప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తానికే ఈసినిమాని అమ్ముకోవచ్చు. అందుకే బిజినెస్ విష‌యంలో చ‌ర‌ణ్ తొంద‌ర‌ప‌డ‌డం లేదు. కానీ డ‌బ్బులు మాత్రం మ‌రో నిర్మాత‌తో ఎందుకు పెట్టించాడ‌న్న‌దే లెక్క తేల‌డం లేదు. చ‌ర‌ణ్ మ‌న‌సులో ఏముందో మ‌రి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై...

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close