ప్రొ.నాగేశ్వర్ : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కులం ప్రభావం ఎంత..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నారు. ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలను.. కులం ప్రభావితం చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ కులం ప్రకారం జరుగుతోందన్న అంచనాలు వెలువడుతున్నాయి. నిజానికి దేశం మొత్తం… రాజకీయాలు కులాల ప్రకారమే జరుగుతూ ఉంటాయి. అయితే ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి ఎవరి ప్రయారిటీ వారికి ఉంటుంది. ఇప్పుడు… రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య రాజకీయం చీలిపోయింది.

టీడీపీ, వైసీపీలకు ఏ ఏ కుల్లాలో ఆదరణ ఉంది..?

ఆంధ్రప్రదేశ్‌పై జాతీయ మీడియా కానీ.. ఆయా పార్టీలు అంతర్గతంగా చేసుకున్న సర్వేల ప్రకారం కానీ.. చూస్తే.. కులం ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేము. తెలంగాణలో ఆ పరిస్థితి కనబడదు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వెనుక కొన్ని కులాలు, వైసీపీ వెనుక కొన్ని కులాలు ఉన్నాయి. అయితే.. ఆయా కులాల్లోని వారందరూ.. మూకుమ్మడిగా.. ఆ పార్టీకి ఓటు వేయకపోవచ్చు. ఇది నియోజకవర్గాల వారీగా కూడా మారుతుంది. అయితే ఓవరాల్‌గా స్టేట్‌వైడ్‌గా చూసుకుంటే.. ఆయా కులాల్లో ఆయా పార్టీలకు ఎక్కువ మద్దతు ఉంటుంది. అనేక సర్వేలు చెప్పేదేమిటంటే.. తెలుగుదేశం పార్టీ వెనుకాల కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, కొప్పుల వెలమ, ఓబీసీలు.. చాలా వరకు టీడీపీ వెనుకాల ఓటింగ్ ఉంది. యాదవ సామాజికవర్గం కొన్ని చోట్ల.. టీడీపీకి.. మరికొన్ని చోట్ల వైసీపీకి అనుకూలంగా ఉంది. శెట్టిబలిజ ఓట్లు… టీడీపీకి ఏకపక్షంగా మద్దతు పలుకుతారు. గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు రావడానికి శెట్టిబలిజల ఓట్లే కీలకం. 2014 నుంచి వచ్చిన మార్పు ఏమిటంటే.. కాపుల్లో కూడా.. టీడీపీపై సానుకూలత ఉంది. వైసీపీతో పోలిస్తే…కాపుల్లో టీడీపీపై ఎక్కువ సానుకూలత ఉంది. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనార్టీ ఓటర్లు మద్దతుదారులుగా ఉన్నారు.

కాంగ్రెస్‌ను అండగా ఉన్న కులాలన్నీ వైసీపీకి మద్దతిస్తున్నాయా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనార్టీ ఓటర్లలో సానుకూలత రావడానికి కారణం.. అంతకు ముందు వారంతా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా… దళితులు, ముస్లింలు.. ఇతర వర్గాలు కాంగ్రెస్‌కు అండగా ఉండేవి అయితే.. ఆయా రాష్ట్రాల్లో పుట్టుకొచ్చిన పార్టీలు.. ఆయా సామాజికవర్గాల మద్దతును కూడగట్టుకోగలిగాయి. దాంతో.. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం ప్రారంభమయింది. యూపీ, బీహార్ సహా.. అనేక రాష్ట్రాల్లో అదే జరిగింది. దక్షిణాదిలో… కూడా.. అంతే. వైసీపీ ప్రారంభం కావడానికి ముందు … దళిత, మైనార్టీ, రెడ్డి ఓటర్లందరూ… కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. జగన్ ఎప్పుడు తిరుగుబాటు చేశారో.. అప్పుడు ఈ ఓటు బ్యాంక్ అంతా జగన్ వైపు వెళ్లింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఓబీసీ వర్గాలకు రాజ్యాధికారం వచ్చింది. తెలంగాణలో కూడా.. బీసీ ఓటర్లలో టీడీపీకి అనుకూలత ఉండటానికి అదేకారణం. ఈ విషయాన్ని పలుమార్లు కేసీఆర్ కూడా చెప్పారు. ఏపీలోనూ… బీసీ వర్గాల్లో టీడీపీకి ఆదరణ రావడానికి అదే కారణం. దళిత వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ వైపు ఉంది. అందుకే దళితుల్లోని ఓ వర్గాన్ని ఆకర్షించడానికి ఎస్పీ వర్గీకరణ అనే అంశాన్ని హైలెట్ చేశారు. దీని ద్వారా మాదిగవర్గం మద్దతు టీడీపీకి లభిస్తోంది. వర్గీకరణ మాదిగల డిమాండ్.

ఈ కుల సమీకరణాలే ఏపీ రాజకీయాల్లో కీలకం..!

రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడంతో… వైసీపీ వైపు ముస్లిం ఓటింగ్ కన్సాలిడేట్ అయింది. గ్రామాల్లో దళితుల ఓటు వైసీపీకి, అగ్రకులాల ఓట్లు.. టీడీపీ వైపు పడుతోంది. ఎప్పుడైతే దళితుల ఓట్లు… వైసీపీ వెనకకు వెళ్లాయో.. అప్పట్నుంచి బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ లాంటి అగ్రకులాల ఓట్లు టీడీపీ వైపు మళ్లాయి. ఈ విధంగా.., రాజకీయ పార్టీలవైపు.. కొన్ని కొన్ని కులాలు కన్సాలిడేట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇది.. అనేక రకాల సర్వేలు చెబుతున్నాయి ఏ కులం అయినా వందకు వంద శాతం సపోర్ట్ చేయదు కానీ… మెజార్టీ సపోర్ట్ చేస్తుది. ఇంత క్లియర్‌ కన్సాలిడేషన్.., తెలంగాణలో లేదు. ఏ ఏ కులాలు ఏ వైపు ఉన్నాయో చెప్పలేము. ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక కారణాలు, ఆయా పార్టీలు తీసుకున్న వైఖరిలను బట్టి.. మనకు ఈ కన్సాలిడేషన్ కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.