ప్రొ.నాగేశ్వర్: మోదీ పెంచిన పన్నులు తగ్గిస్తే పెట్రోలు చవకే..!

పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు కొత్త రికార్డు నమోదవుతోంది. అందుకే ఇప్పుడు పెట్రో ధరలను ఎందుకు తగ్గించలేకపోతున్నారన్న చర్చ దేశవ్యాప్తంగా ప్రారంభమయింది. ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది. కానీ కేంద్రం పెట్రో ధరలు తగ్గించడానికి దీర్ఖకాలిక చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది కానీ ఉన్న పళంగా సామాన్యులకు రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు.

డాలర్, క్రూడాయిల్ ధలదే అసలు ఎఫెక్ట్…!
అంతర్జాతీయ పరిణామాలే ఎక్కువ పెట్రోల్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువలో వచ్చే మార్పులు కూడా… పెట్రో ధరలపై ప్రభావం చూపిస్తాయి. మన దేశం పెట్రోలియం ఉత్పత్తుల్లో… 70 నుంచి ఎనభై శాతం దిగుమతులే. అలా కాకకుండా.. కనీసం యాభై శాతం వరకైనా… సొంతంగా దేశం ఉత్పత్తి చేసుకోగలిగితే… ధరలను తగ్గించడానికి వీలవుతుంది. కానీ వెంటనే ఇది సాధ్యం కొన్ని దశాబ్దాలు పడుతుంది. రెండోది బయో ఫ్యూయల్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. పెట్రోల్ లో ఇథనాల్ కలపడం వల్ల… పెట్రోల్ ధరలను తగ్గించుకోవచ్చు. పర్యావరణానికి కూడా ఉపయోగపడుతుంది. ఇథనాల్ ఉత్పత్తి గతంలో… చెరకు పరిశ్రమల్లో ఉపఉత్పత్తిగానే పరిగణించేవారు. నేరుగా ఉత్పత్తి చేయడానికి పర్మిష‌న్ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు నేరుగా.. ఇథనాల్ ను ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. కానీ ఈ బయోఫ్యూయల్ గురించి చాలా కాలం నుంచి చెబుతున్నా.. పెద్దగా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. మూడోది.. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గించడం. భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో 70 శాతం మంది సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ను మెరుగుపరిస్తే… పెట్రోల్, డీజిల్ వినియోగం చాలా వరకు తగ్గిపోతుంది.

కేంద్రం ముందు చాలా ప్రత్యామ్నాయాలు..!
పెట్రో ధరలను నియంత్రించడానికి చేసుకోవాల్సిన మరో ప్రయత్నం.. “స్టేట్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్”. అంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బాగా తక్కువకు కొని.. నిల్వ ఉంచుకోవడం. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పుడు ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు మన దేశంలో ఆయిల్ రిజర్వ్ బాగా తగ్గిపోయింది. ఇంకో మార్గం.. ఆయిల్ ఈక్విటీ. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం. దీని వల్ల రేపు ఈక్విటీగా ఆయిల్ వస్తుంది కాబట్టి.. ధరపై ప్రభావం పడదు. ఓఎన్జీసీ ఇప్పటికే రష్యా లాంటి దేశాల్లో ఈ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇవన్నీ… ప్రజలకు ఉన్న పళంగా ఉపశమనం ఇచ్చేవి కావు. . దీర్ఘకాలమైన ప్రణాళిక, విజన్ ఉండాలి. ఇదే కాకుండా ప్రత్యామ్నాయంగా విండ్, సోలార్ ఎనర్జీని ప్రొత్సహించాల్సి ఉంటుంది.

మోదీ పెంచిన పన్నులు తగ్గిస్తే చాలు..!
ఇప్పటికిప్పుడు నరేంద్రమోదీ తలుచుకుంటే… ఇంధనం ధరులు సులువుగా తగ్గించేయవచ్చు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 మే నుంచి 2016 జూన్ వరకు.. తొమ్మిసార్లు.. ఎక్సయిజ్ టాక్స్ పెరిగింది. దాదాపుగా లీటర్‌పై రూ. 10కిపైనే టాక్స్ పెంచారు. అప్పుడు చములు ధరలు బాగా తగ్గాయి. అప్పుడు ధరలు తగ్గిస్తే.. మళ్లీ పెరిగినప్పుడు ప్రజలు భరించలేరన్న కారణంతో కేంద్రం ఎక్సయిజ్ పన్నును పెంచింది. కానీ అంతర్జాతీయ మార్గెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు… ధరలు పెంచకుండా ఉండాలి. కానీ ప్రభుత్వం పెంచుకుంటూనే పోతోంది. మోదీ మొదట్లో ఎక్సయిజ్ ట్యాక్స్ ను తగ్గిస్తేనే… లీటర్‌కు పది రూపాయలకు సులువుగా తగ్గిపోతుంది. యూపీఏ హయాంలో ఉన్నప్పుడు పన్నులు ఉంచితే చాలు… పది రూపాయలు పెట్రోల్ రేటు తగ్గిపోతుంది. రాష్ట్రాల్లో వాల్యూయాడెడ్ టాక్స్ విధిస్తున్నారు. ఇది పన్ను మీద పన్ను. ఈ పన్నును రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తే.. మరో మూడు రూపాయలు తగ్గించొచ్చు. అంటే.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు.. అధికంగా వసూలు చేస్తున్న పన్నును వసూలు చేయడం నిలిపి వేస్తే చాలు.. పదిహేను రూపాయల వరకూ తగ్గుతుంది.

కార్పొరేట్లకు రాయితీలు తగ్గిస్తే ప్రజలకు మేలు..!
కానీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులెక్కడి నుంచి వస్తాయని కబుర్లు చెబుతోంది. ప్రతి ఏటా ఆరు లక్షల కోట్లను.. ప్రభుత్వం వివిధ వర్గాలకు రాయితీలుగా ఇస్తోంది. ఇందులో రెండు లక్షల కోట్లు.. న్యాయం ఇవ్వాల్సిన వారికి రాయితీలుగా ఇస్తున్నా.. నాలుగు లక్షల కోట్లను కార్పొరేట్ రంగానికి రాయితీలుగా ఇస్తున్నారు. ఈ నాలుగు లక్షల కోట్లలో ఒకటి, రెండు లక్షల కోట్లను తగ్గించుకున్నా.. పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించి సామాన్యులకు రిలీఫ్ కల్పించవచ్చు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లే 70శాతం పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నారు.

జీఎస్టీలో చేర్చి సెస్‌లేస్తే ఏం ఉపయోగం..?
ప్రభుత్వ విధానం ఇలానే ఉంటే… జీఎస్టీలో పెట్రోల్, డీజిల్ ను…జీఎస్టీలో చేర్చినా ప్రయోజనం ఉండదు. జీఎస్టీలో ఇరవై ఎనిమిది శాతం స్లాట్‌ లో పెట్టి.. పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెస్‌లు వేస్తే… వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. జీఎస్టీలో పెట్రోల్, డీజిల్ ను చేర్చి… ఏమీ సెస్‌లు వేయకపోతే.. రూ. 17 నుంచి ఇరవై వరకూ తగ్గుతుంది. అసలు పెట్రోల్ రేటు కన్నా… పన్నులు ఎక్కువ ఉండటం వల్లే సమస్య వస్తోంది.సాధారణం పెట్రోల్ ఉత్పత్తి ధర అన్నీ ఖర్చులు కలుపుకుని 37 రూపాయలు ఉంటే.. పన్నులు 39 రూపాయలు పడుతున్నాయి. అందు వల్ల పొరుగు దేశాల కన్నా.. ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ. నరేంద్రమోదీ తలుచుకుంటే.. రేట్లను.. ఒక్క క్షణంలో తగ్గించేయవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.