చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా చేరిపోయారు. కొంత కాలంగా ఆయన ఏపీలో వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. చాలా మంది పట్టించుకోలేదు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. బీజేపీని వ్యతిరేకించే కమ్యూనిస్టు భావజాలం ఉన్న ప్రొఫెసర్ కాబట్టి.. చంద్రబాబుపై కోపంతో జగన్ ను సపోర్టు చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఆ సపోర్టు బుద్దిని మందగించేలా చేస్తోంది. చివరికి ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పాస్ బుక్‌ల మీద జగన్ ఫోటోలు ఉండటాన్ని సమర్థిస్తున్నారు.

వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మ ఉంటే ఏమన్నారు నాగేశ్వర్ గారూ !

ఓ టీవీ చానల్ కూర్చుని ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ల మీద జగన్ బొమ్మ ఉంటే తప్పేమిటని వాదించేశారు. ఎలా తప్పవుతుందో చెప్పుకునే ముందు ఇదే నాగేశ్వర్.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోడీ బొమ్మ ఉన్నందున ఎన్నెన్ని మాటలన్నారో అందరికీ తెలుసు. మేధావి కదా అని చాలా మంది ఆయన మాటలు వింటారు. కానీ ఆ మేధావి తనాన్ని ఓ విలువ కట్టి అమ్ముకుంటారని తెలియని చాలా మంది ఇది నిజమే కదా అనిపించుకునేలా చెబుతూంటారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద మోది బొమ్మను బీజేపీ వాళ్లు తప్ప అందరూ తప్పు పట్టారు. అయితే మోదీ అంత వరకే పరిమితమయ్యారు. ఆస్తి పత్రాల మీదకు రాలేదు. ఇప్పుడు జగన్ వచ్చేశారు.

ప్రభుత్వం శాశ్వతం – సీఎం కాదు – ఈ మాత్రం తెలియదా ?

ప్రభుత్వం శాశ్వతంగా ఇచ్చే పత్రాల మీద ప్రస్తుత సీఎం ఫోటో వేస్తారా… ప్రస్తుత పాలక పార్టీ ముద్ర వేసి పాస్ బుక్కులు ఇస్తారా..?. మా ఆస్తుల మీద మీ ఫోటో ఏందని.. వారికి ఓట్లేసిన వారే నిలదీస్తున్నారు. ఈ డౌట్ ప్రొఫెసర్ గారికి ఎందుకు రాలేదో. ప్రొఫెసర్ అని చెప్పడానికి ఇబ్బందిగా ఉంటోంది .. ఆయన రాజకీయ నాయకుడు కూడా కాబట్టి .. నాగేశ్వర్ గారనే చెప్పుకుందాం.. మరి నాగేశ్వర్ గారికి ఎందుకు రాలేదు ?. ఆయనకు ఉన్న నాలెడ్జ్ సరిపోలేదా . చరిత్రలో శాశ్వతంగా ఉన్న ఒక్క సీఎంను చూపిస్తారా ?. జ్యోతిబసు కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారుగా . జగన్ రేపు ఓడితే.. వచ్చే ముఖ్యమంత్రి అవన్నీ తీసేసి మళ్లీ తన ఫోటోలతో ముద్రించుకోవాలా ?

టెన్త్ సర్టిఫికెట్లు, మ్యారేజ్ సర్టిఫికెట్ల మీద కూడా వేసుకోవాలని చెబుతున్నారా ?

నాగేశ్వర్ చెప్పిన లెక్క ప్రకారం ప్రభుత్వం ఎవరిది ఉంటే ఆ సీఎం ఫోటోతో అధికారిక పత్రాలు జారీ చేయవచ్చు. చంద్రబాబును వ్యతిరేకించడానికి జగన్ ను సమర్థించడానికి ఇంతగా దిగజారిపోవాల్సిన అవసరం ఏమిటో నాగేశ్వర్ కే తెలియాలి. ప్రభుత్వం ప్రభుత్వమే. అది శాశ్వతం. కానీ పాలకులు మాత్రం మారిపోతూ ఉంటారు. పాలకుల ప్రజెన్స్ వారు అధికారంలో ఉన్నంత కాలంమే ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని కాకా పట్టి పదో పరకో వెనకేసుకోవచ్చు కానీ.. అంతకు మించి సమాజానికి కీడు చేస్తున్నట్లుగా గుర్తించకపోతే ఆ మేధావితనం అసహ్యకరంగా మారుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close