ప్రొఫెస్సర్ కోదండరామ్ మౌనం వీడబోతున్నారా?

ఎన్నికల సమయంలో తెలంగాణాలో బీసీవర్గాల ఓట్లకు గ్యాలం వేసేందుకే చంద్రబాబు ఆర్. కృష్ణయ్యను ముందుకు తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా తెలంగాణా ఉద్యమాలకి ఆజ్యం పోసేందుకే కేసీఆర్ ప్రొఫెస్సర్ కోదండరామ్ ని పూర్తిగా వాడుకొన్నారు. కానీ ఆ తరువాత చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ముఖ్యమంత్రులు కాగానే వారిద్దరినీ పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేసారు. దానితో వారిద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు వారిద్దరూ తమ ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడవలసి రావడం చాలా దురదృష్టకరం.

తెలంగాణా పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకొంటున్నట్లు చెప్పినప్పటికీ కేసీఆర్ ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రొఫెస్సర్ కోదండరామ్ నేటికీ తెలంగాణా రాజకీయ జె.ఏ.సి.ని కొనసాగిస్తున్నప్పటికీ, తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేరు. అనేక తీవ్ర సమస్యలపై ఆయన మౌనం వహించాల్సి వచ్చింది. రాజకీయాలలో ఎంతో చురుకుగా ఉండే వారికి అది నిజంగా నరకమే. సుమారు 16 నెలల తన మౌన దీక్షను కోదండరామ్ ఇపుడిపుడే వీడేందుకు సిద్దపడుతున్నట్లున్నారు.

తెలంగాణా రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు చాలా ఆందోళనకర స్థాయికి చేరుకొన్నాయి. దానిపై ఉప్పు..నిప్పూలాగ ఉండే ప్రతిపక్షాలన్నీ కలిసి తెరాస ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. కానీ అందుకు తెరాస ప్రభుత్వ స్పందన చాలా విస్మయం కలిగించేదిగా ఉంది. ప్రతిపక్షాలను సలహాలను, సూచనలను స్వీకరించి రైతుల ఆత్మహత్యలను నివారించే ప్రయత్నం చేయకుండా, సమస్య తీవ్రత గురించి హెచ్చరిస్తున్న వారిని ధీటుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తన పార్టీ నేతలకు సలహా ఇవ్వడం ఎవరూ జీర్ణించుకోలేరు.

బహుశః అందుకే కోదండరామ్ కూడా ఈ విషయంలో తన మౌనం వీడారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ కొన్ని రోజుల క్రితం జనచైతన్య సమితి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానిలో తను కూడా ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున కోదండరామ్ ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేసారు. రైతుల ఆత్మహత్యల సమస్యపై కోర్టులో తన వాదనలు కూడా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోదండరామ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయన పిటిషన్ పై కోర్టు రేపు తన నిర్ణయం తెలియజేస్తుంది.

ఒకవేళ ఈకేసులో కోదండరామ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పు పడుతూ వాదించినట్లయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహానికి ఆయన కూడా గురికాక తప్పదు. అలాగని ఈ కేసులో ఇంప్లీడ్ అయిన తరువాత ఇదివరకులాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఏవో కొన్ని ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొంటే దాని వలన ఆయన ప్రతిష్ట మరింత మసకబారుతుంది. కేసీఆర్ ప్రభుత్వం గురించి కోదండరామ్ కోర్టులో ఏమి చెపుతారో వేచి చూడా వలసిందే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close