ప్రొ.నాగేశ్వర్ : గోవాకు ప్రత్యేకహోదా ఇస్తామంటున్న బీజేపీ..! ఏపీకి ఎందుకివ్వరు..?

భారతీయ జనతా పార్టీ ప్రత్యేకహోదా ఇస్తానంటోంది. అయితే.. అది ఆంధ్రప్రదేశ్‌కు కాదు.. గోవాకు. ఇప్పుడు.. గోవాకు ప్రత్యేకహోదా ఇస్తామంటూ.. బీజేపీ అగ్రనేతలు.. ప్రచారం చేయడం ప్రారంభించారు. అక్కడి ప్రజలకు హామీ ఇస్తూ లోక్‌సభ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ హామీని ఆషామాషీగా ఇవ్వడం లేదు. మేనిఫెస్టోలో కూడా పెడతామంటున్నారు. దీంతో అందరూ.. ఏపీ సంగతేమిటి.. అన్న ప్రశ్న లేవనెత్తుతున్నారు.

గోవాకి ప్రత్యేకహోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెడతామన్న బీజేపీ…!

మూడు రోజుల క్రితం.. గోవాలో ఎన్నికల ప్రచారసభ నిర్వహించిన బీజేపీ అగ్రనేతలు.. గోవా ప్రజలకు ఇచ్చిన ప్రధానమైన హామీ ప్రత్యేకహోదా. దాన్ని మేనిఫెస్టోలో పెట్టి.. మళ్లీ బీజేపీ గెలవగానే ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకకటించారు. దానికి వారు చెప్పిన కారణాలు.. గోవా చిన్న రాష్ట్రం, విపరీతంగా వలసలు వస్తున్నారు. పర్యాటకులు కూడా తగ్గిపోతున్నారు.. ..ఈ కారణాల వల్ల గోవా నిలబడాలంటే.. ప్రత్యేకహోదా కావాల్సిందేనని అంటున్నారు. బీజేపీని మళ్లీ గెలిపిస్తే… హోదా తీసుకు వస్తామంటున్నారు. నిజానికి భారతీయ జనతా పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు తిరస్కరించారు. కానీ.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, ఇండిపెండెంట్లను కలుపుకుని… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవాలో అతి పెద్ద పార్టీ కాంగ్రెస్. అక్కడ అసెంబ్లీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంది కాంగ్రెస్ పార్టీకి. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత ఏర్పడిన కూటమినే అక్కడ గవర్నర్ పిలవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకకు భిన్నంగా గోవాలో రాజకీయం జరిగింది. బీజేపీ అనుకూల గవర్నర్లే అయినా భిన్నంగా వ్యవహరించారు. గోవాను నిలుపుకోవడం… కీలకమని అనుకోవచ్చు. మోదీ.. ఇలాంటి వ్యవహారాలు చాలా కాలం నుంచి బీహార్, కశ్మీర్ విషయంలోనూ అంతే చేశారు. ఎన్నికల సమయంలో భారీగా ప్యాకేజీలు ప్రకటించారు.

ఏపీ విషయంలో చెప్పిన అభ్యంతరాలు గోవాకు పని చేయవా..?

భారతీయ జనతా పార్టీ తీరు… ఆందోళనకరంగా ఉంది. ఆయా రాష్ట్రాల పరిస్థితులు ఇతర అంశాలను పట్టించుకోకుండా.. కేవలం ఎన్నికలు, తమ రాజకీయ లబ్ధిని చూసుకుని.. వారు వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా హామీ ఇచ్చినా… ఇవ్వలేమని చెబుతోంది. ఎందుకు ఇవ్వలేరంటే… పధ్నాలుగో ఆర్థిక సంఘాన్ని కారణంగా చెబుతోంది. పధ్నాలుగో ఆర్థిక సంఘం.. హోదాను రద్దు చేసింది.. అందుకే ఇవ్వలేకపోతున్నాం.. ఆ కారణంగా ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు గోవాకు ఎలా ఇస్తామంటున్నారు..? . నిజానికి పధ్నాలుగో ఆర్థిక సంఘం… ప్రత్యేకహోదా ఇవ్వాలా వద్దా.. అనేది ఎక్కడా చెప్పలేదు. ఆ కమిటీ చైర్మనే ఆ విషయమే చెప్పారు. అలా ఉంది కాబట్టే.. బీజేపీ ఉపాధ్యక్షుడే గోవాకు.. ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు. దీనికి వివరఇ ఇస్తారా..? ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన జీవీఎల్ నరసింహారావు చెప్పాలి..?. 2017కి దేశంలో ఏ హోదాకు ప్రత్యేకహోదా ఉండదన్నారు. మరి గోవాకు ఎలా ఉంటుంది..?

ఏపీలో ఓట్లు, సీట్లు లేవనే ప్రత్యేకహోదా ఇవ్వమంటున్నారా..?

గోవాకు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు కాబట్టి.. ఇప్పుడు ఏపీ ప్రజలకు వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రేపు మోడీ ఏపీకి వస్తున్నారు.. అమిత్ షా .. అప్పుడప్పుడు వచ్చిపోతూనే ఉన్నారు.. వీరందరూ… వచ్చి కచ్చితంగా ప్రత్యేకహోదా.. గోవాకి ఇస్తామని చెప్పినట్లుగా.. ఏపీకి ఎందుకివ్వడం లేదో చెప్పాలి. లేకపోతే.. గోవాకు ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీ ఉపాధ్యక్షుడికి షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదు. ప్రత్యేకహోదా విషయంలో కేవలం.. బీజేపీది రాజకీయ వైఖరి అని స్పష్టమవుతోంది. దీనిపై ప్రధాని స్పందించాలని డిమాండ్లు వినిపిస్తూంటే… మోడీ.. బీజేపీ నేతగా విశాఖకు వస్తున్నారని.. ప్రధానిగా కాదంటూ.. కొత్తగా కబుర్లు చెప్పడం ప్రారంభించారు. రెండింటింకి తేడా ఏమిటో తెలియదు. బీజేపీ నేత అవడం… వల్లే ప్రధాని అయ్యారు. రాజకీయ నేతలకు నైతికత ఉండాలి. ఓ మాట ఉండే.. దానికి కట్టుబడి ఉండాలి. కానీ బీజేపీ నేతల్లో అది కొరవడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.