ప్రొ.నాగేశ్వర్ : రాఫెల్‌పై సుప్రీంకోర్టులో కేంద్రం వాదనలన్నీ అబద్దాలేనా..?

రాఫెల్ డీల్‌కు సంబంధించి… సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. రాఫెల్‌డీల్‌లో అవినీతి జరిగిందని దాఖలైన పిటిషన్‌పై… సుప్రీంకోర్టు ఇప్పటికే… విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు అడిగింది. వాటిపై ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. నిజానికి ఈ రాఫెల్ డీల్ విషయంలో ప్రభుత్వం ఒకక్ అంశాన్ని బయటకు చెప్పడం లేదు. వివిధ రకాల మాధ్యమాల కారణంగా మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వాటిని బీజేపీ ప్రభుత్వం అవననడం లేదు.. ఖండించడం లేదు.

అత్యవసరం అని రద్దు చేశారట.. మరి ఒక్క విమానం కూడా అందలేదేమిటి..?

రాఫెల్ డీల్ విషయంలో సుప్రీంకోర్టు ముందు.. కేంద్రం వాదించినవాటిలో అత్యంత ముఖ్యమైనది.. మొదటిది.. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత ఎమర్జెన్సీ. అందుకే పాత ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పుకొచ్చింది. 126 విమానాలు ఇచ్చేసరికి ఆలస్యమవుతుంది.. . ఇప్పటికే… పొరుగు దేశాలు.. చాలా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్నాయి కాబట్టి.. ఒప్పందాన్ని రద్దు చేసుకుని 36 విమానాలు కొనడానికి సిద్ధపడ్డమనేది మొదటి వాదన. ఈ వాదన నిజం కాదు. ఎయిర్‌ఫోర్స్ ఏం చెప్పిందేమిటంటే.. 126 యుద్ధ విమానాలు కావాలని అడుగుతోంది. ఇప్పటికే ఉన్న రష్యా విమానాలు పాతవైపోయాయని చెబుతోంది. మరి 126 విమానాలు కావాలని.. ఎయిర్‌ఫోర్స్ అడుగుతున్నప్పుడు.. 36కే ఎందుకు పరిమితమవుతున్నారు..?. ఇవి సైనికుల అవసరాలను తీర్చవు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి మళ్లీ సింగిల్ జెట్ పైటర్స్‌ కొనుగోలు చేయాడనికి 115 జెట్ ఫైటర్స్ కు ఆర్డర్ ఇచ్చారు. స్వీడిష్ కంపెనీకి.. గౌతమ్ ఆదాని భాగస్వామ్యంలో.. ఈ జెట్ ఫైటర్స్.. ఇండియా కొనుగోలు చేయబోతోంది. అంటే.. ఆ వాదన అంతా అబద్దమని తేలిపోతుంది. మరి ఇప్పటికైనా… రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్నాయా..?. 2016లో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఒక్క రాఫెల్ విమానం కూడా రాలేదు. 2020 తర్వాతే మొదటి రాఫెల్ విమానం భారత గడ్డపైకి వస్తుంది. ఇక్కడ అత్యవసరం కోసం చేస్తున్నదేముంది..?

హెచ్‌ఏఎల్‌తో కేంద్రానికి ఉన్న సమస్య ఏమిటి..?

రెండో వాదన.. ఇండియన్ ఆఫ్‌సెట్ ఓనర్ ఎవరన్నదానిపైనే ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అనిల్ అంబానీ కంపెనీని ఆఫ్‌సెట్ పార్టనర్‌గా చేర్చారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం… ప్రాన్స్ కంపెనీ.. ఇండియన్ పార్టనర్‌గా ఎవర్ని ఎంచుకుంటుందో.. తమకు సంబంధం లేదని చెబుతోంది. ఇది తప్పని… హెచ్‌ఏఎల్ అధినేత ఇంతకు ముందే ప్రకటించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఉన్న హోలాండే కూడా ప్రకటించారు. దసో కంపెనీ.. మొదటగా.. హెచ్‌ఏఎల్‌లో భాగస్వామ్యం కానుంది. ఆ తర్వాత రిలయన్స్ కంపెనీని చేర్చుకుంది. హెచ్‌ఏఎల్‌తో ఏమైనా ససమస్య ఉందా.. అని దసో సీఈవోని అడిగారు. హెచ్‌ఏఎల్‌లో తమకేం ప్రాబ్లం లేదని.. అది హెచ్‌ఏఎల్‌కు గవర్నమెంట్ కు మధ్య ఉన్న సమస్య అని చెప్పుకొచ్చారు. మాకు హెచ్‌ఏఎల్‌పై… నమ్మకం ఉంది.. భారత ప్రభుత్వానికే లేదని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు కు కేంద్రం చెప్పింది.. ఇండియన్ ఆఫ్‌సెట్ పార్టనర్‌గా ఎవరు ఉండాలో దసో కంపెనీ నిర్ణయించుకుందన్నారు. దానికి విరుద్ధంగా దసో సీఈవో చెబుతున్నారు.

ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంటే దసోకి బిలియన్ యూరోలు ఎందుకు చెల్లించారు..?

ఇక కేంద్రం వాదన కూడా.. భిన్నంగా ఇది. ఈ ఒప్పందం.. ప్రభుత్వానికి.. ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం అని..ఇందులో అవినీతి ఏముందని.. మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇదే వాదన సుప్రీంకోర్టులో వినిపించింది. ఒక వైపు దసో కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం.. ఆ కంపెనీ ఆఫ్‌సెట్‌ పార్టనర్‌గా ఎవర్ని ఎంపిక చేసుకున్నా తమకు సంబంధం లేదని చెబుతున్నారు. మరో వైపు భారత ప్రభుత్వానికి.. ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అంటారు. రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరితే.. ఇండియన్ ఆఫ్‌సెట్ పార్టనర్‌గా ఎవర్ని ఎంచుకోవాలన్న అంశంపై.. భారత ప్రభుత్వానికి సంబంధం ఉండదా..?. అసలు.. ప్రభుత్వానికి.. ప్రభుత్వానికి మధ్య డీల్ కాకపోయినా.. అధి యుద్ధ విమానం.. రక్షణకు సంబంధించిన సున్నితమైన అంశం. ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకోవాలి. అయినా కూడా.. ప్రభుత్వానికి.. ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం అయినప్పుడు.. ఆఫ్‌సెట్ పార్టనర్‌ విషయంపై ప్రభుత్వానికి కచ్చితంగా అధికారులు ఉంటాయి. ఈ వాదన చూస్తే.. అసలు ఈ ఒప్పందం .. దసోతో జరిగిందా.. లేక ఫ్రాన్స్ ప్రభుత్వంతో జరిగిందా అన్నదానిపై ప్రభుత్వమే చెప్పలేకపోతోంది. ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య డీల్ అయితే.. దసోల్ట్ కంపెనీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లించింది. దాదాపుగా ఒక బిలియన్ యూరోస్.. ఏ బ్యంక్ గ్యారెంటీ లేకుండా.. భారత ప్రభుత్వం దసో కంపెనీకి చెల్లించింది. సాధారణంగా.. ప్రభుత్వం ఏదైనా ప్రైవేటు కంపెనీకి డబ్బులు చెల్లించేటప్పుడు కచ్చితంగా బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది. ఎందుకంటే.. డబ్బులు తీసుకుని బ్యాంక్ విమానాలు సప్లయ్ చేయకపోతే.. ఎవర్ని అడుగుతారు..?. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది. ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య వివాదాలొచ్చినప్పుడు.. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ జరిగే జెనీవాలో పరిష్కారమవుతాయి. కానీ ఈ డీల్‌పై… ఏదైనా వివాదాలొస్తే.. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ వెళ్లే అవకాశం లేదు., ఇంతకు ముందు ఈ డీల్ పై ఏదైనా వివాదం వస్తే ఢిల్లీలో తేల్చుకోవాలనే రూల్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఢిల్లీలో తేల్చుకునేది లేదు.. జెనీవాలో తేల్చుకునేది లేదు.. బ్యాంక్ గ్యారంటీలేదు. మరి ప్రభుత్వం – ప్రభుత్వం మధ్య డీల్ అని ఎలా ఉంటారు..?

కొనుగోళ్ల రూల్స్‌లో ఒక్కటీ ఎందుకు పాటించలేదు..?

2013లో తీసుకున్న నిబంధనలను ఫాలో అయ్యామని సుప్రీంకోర్టులో కేంద్రం వాదించింది. ఇది కూడా పూర్తిగా అబద్దం. 2015లో… అకస్మాత్‌గా… ఫ్రాన్స్ పర్యటనలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ డీల్ ను కుదుర్చుకున్నారు. ఆ సమయంలో… రక్షణ మంత్రి పారీకర్ గోవాలో చేపల మార్కెట్ ప్రారంభిస్తున్నారు. 2016లో ఒప్పందంపై సంతకాలు పెరిగాయి. 2013 డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ ఏం చెబుతోంది..?. మొదట.. డిఫెన్స్ ఎక్విజేషన్ కౌన్సిల్ సమావేశం కావాలి.. ఆ తర్వాత.. కేబినెట్ కమిటీ అని సెక్యూరీటీ ఎఫైర్స్ క్లియర్ చేయాలి. .. తర్వాత ప్రధానమంత్రి తన ఆలోచననుప్రకటించారు… నిర్ణయం ప్రకటించకూడదు. అదే నిజం అయితే.. 2015 ఏప్రిల్‌లో కొత్త ఒప్పందం గురించి ప్రకటించేవరూక పాత ఒప్పందాన్ని రద్దు చేయలేదు. అలాగే ఇండియన్ పార్టనర్‌ను ఎంచుకోవడం ఎందుకంటే.. దేశీయ రక్షణ సామర్థ్యం, సాంకేతికను పెంచుకోవడానికే అన్నారు. ఇలా అయితే… అసలు పేపర్‌పైనే ఉన్న కంపెనీ.. రిలయన్స్ డిఫెన్స్‌తో ఎలా సాధ్యమవుతుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.