ప్రొ.నాగేశ్వర్ : ఎమ్మెల్యేలు “టచ్‌”లో ఉండటంలో తప్పు లేదంటున్న జీవీఎల్..!

సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు.. తమ విధానాలను బహిరంగ పరుస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. కూడా.. బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌కు చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని బహిరంగంగానే బెదిరించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుందని… మమతా బెనర్జీని హెచ్చరించారు. దీంతో.. ఈ టచ్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యారు.

కాంగ్రెస్‌తో బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉండటం కూడా మంచిదేనా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ “టచ్” కామెంట్స్‌ను సమర్థించడానికి.. ఆ పార్టీ అధికార ప్రతినిధి, యూపీ నుంచి ఎంపీగా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహారావు ఏ మాత్రం తడుముకోవడం లేదు. మీడియా చానళ్లకు ఇస్తున్న ఇంటర్యూల్లో.. ఇలా ఓ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మరో పార్టీతో టచ్‌లో ఉండటం శుభకరమైన పరిణామంగా చెబుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికే మంచిదన్నట్లుగా ఆయన చెబుతున్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరడం… మంచి సంకేతం అంటూ… అలా టచ్‌లో ఉండటం.. తప్పేముంది..? ఉండకూడదని నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా.. అంటూ.. టచ్చింగ్ కామెంట్స్ చేశారు. జీవీఎల్ మాటలు ఇప్పుడు.. అనేక రకాల అర్థాలు తీసుకునేలా చేస్తున్నాయ. గత అరవై డెభ్బై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో.. ఇతర పార్టీల నేతలందరూ టచ్‌లో ఉండటం కరెక్టేనని.. జీవీఎల్ అంగీకరిస్తున్నట్లయింది. మోడీ మంచి వ్యక్తి కనుక.. ఆయనతో టచ్‌లో ఉంటే మంచి వాళ్లు.. మిగతా వాళ్లు మంచి వాళ్లు కాదని అర్థమా..?

అడ్డగోలుగా వాదించడం వాక్చాతుర్యమా…?

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో… ఎమ్మెల్యేలు.. రాహుల్ గాంధీతో టచ్‌లో ఉంటే.. అది దుర్మార్గం. అదే మోడీతో టచ్‌లో ఉంటే.. మాత్రం వారు మంచి వాళ్లు. ఓ పార్టీ నాయకులు.. మరో పార్టీతో టచ్‌లో ఉంటే.. నేరం కాదు. యాంటీ డిఫెక్షన్ లా లో ఎక్కడా.. టచ్ గురించి ప్రస్తావన లేదు. టెక్నికల్‌గా ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. విప్ ఉల్లంఘించినా… పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా… వదులుకుంటే.. అనర్హుడవుతాడు. అంతే తప్ప.. టచ్‌లో ఉంటే… యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. ఇంత వరకూ.. ఇలాంటి ప్రస్తావన రాలేదు. జీవీఎల్ ఇలా వాదిస్తే… ఎవరేం చెప్పగలరు. ఇలా చెప్పినందుకు.. జీవీఎల్‌ను అభినందించాల్సిందే. అడ్డగోలుగా మాట్లాడే సామర్థ్యం ఉందని మాట్లాడితే..మనం ఏమీ చేయలేం. టచ్‌ అంటే… ఫిజికల్‌గా టచ్ చేయడం కాదు కదా..!. దానికి రాజకీయంగా ఉన్న అర్థాలు దానికి ఉన్నాయి.

చట్టానికి అందమని చెప్పి ప్రభుత్వాల్ని కూల్చేస్తారా..?

రాజకీయంగా… ప్రధానమంత్రిహోదాలో మోడీ ఉన్నారు కాబట్టి.. ఎమ్మెల్యేలు ఎవరైనా వెళ్లి.. తమ రాష్ట్రం… తమ జిల్లా.. తమ నియోజకవర్గం సమస్యల గురించి ప్రజెంటేషన్ ఇచ్చి.. టచ్ చేసి వస్తే.. అది పెద్ద విషయం కాదు. కానీ మోడీ అన్న టచ్‌కు అర్థం.. వేరే ఉంది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చడానికి.. బెంగాల్‌లో ఉన్న ప్రభుత్వాన్ని పేల్చడానికి.. ఢిల్లీలో ఉన్న.. ఆప్ ప్రభుత్వాన్ని లేకుండా చేయడానికి.. ఈ టచ్చింగ్ ఆపరేషన్ నడుస్తోంది. ఇది జరుగుతోంది కాబట్టే.. అంటున్నారు.. ఇదేమీ లేకపోతే… ప్రధానితో ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరూ పట్టించుకోరు. టచ్‌లో ఉండటం అంటే.. ఏమిటో.. జీవీఎల్‌కు తెలిసి కూడా.. వితండ వాదన చేసి.. తన పార్టీని వెనకేసుకు రావాలనుకుంటున్నారు కానీ.. ఆయన ఉద్దేశం ఏమిటో.. బీజేపీ ఉద్దేశం ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.