ప్రొ.నాగేశ్వర్ : పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తే జగన్‌కు నష్టమే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి… జనసేనాని పవన్ కల్యాణ్‌పై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకి పార్టనర్ అని.. యాక్టర్ అని.. రోజూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తున్నారని అంటున్నారు. ఈ విమర్శల దాడి అలా పెంచుకుంటూనే పోతున్నారు. అయితే.. పవన్ పై విమర్శల వల్ల జగన్మోహన్ రెడ్డే ఎక్కువగా నష్టపోతున్నారని ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాన్ని విశ్లేషిస్తే అర్థమైపోతుంది.

పవన్‌ను జగన్ టార్గెట్ చేస్తే ఓట్లు పోగొట్టుకున్నట్లేనా..?

వైసీపీ అధినేత.. రోజూ.. పవన్ కల్యాణ్‌ను.. టీడీపీ పార్టనర్ అని విమర్శించడం వల్ల.. ఓ రకంగా.. జనసేనను శీలపరీక్షకు పెడుతున్నారు. ఇలా శీలపరీక్ష పెట్టడం వల్ల ఏం జరుగుతుంది..? ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు… టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. జనసేన, కమ్యూనిస్టుల కూటమి కూడా.. కొన్ని సీట్లలో పోటీ ఇస్తోంది కానీ.. అన్ని సీట్లలో కాదు. చాలా సీట్లలో జనసేన అభ్యర్థులు… రెండు ప్రధాన పార్టీల పోటీ దార్ల మధ్య మరో పోటీదారుగా ఉన్నారు కానీ.. వారిని విజయం సాధించే వారి ఖాతాలో వేయలేం. ఇలాంటి సమయంలో.. ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి ఓటర్లు స్ప్లిట్ అవుతారు. నా ఓటు ఎందుకు.. మురిగిపోవాలి అనుకుంటారు. ఎక్కడైనా జరిగేది అదే. తన ఓటు ఉపయోగపడాలని కోరుకుంటారు. అలాంటప్పుడు జనసేనకు కాకుండా.. ఇతరులకు ఓటు వేయాలని ఆలోచిస్తారు.

చంద్రబాబు పవన్‌ను విమర్శించకపోవడం వ్యూహాత్మకమేనా..?

జనసేనకు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉంటారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకే ఓటు వేస్తారు. వీరిని కోర్ ఓటింగ్ అనవచ్చు. గెలిచే అవకాశం ఉన్నా లేకపోయినా… వారంతా.. కచ్చితంగా జనసేనకే వేస్తారు. వారిని కోర్ ఓటింగ్ అనవచ్చు. కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు… అలాగే ఉంటారు. కమ్యూనిస్టులు ఎక్కడ పోటీ చేసినా.. ఒక శాతమో.. రెండు శాతమో ఓట్లు వస్తాయి. వీరు కమ్యూనిస్టులకు తప్ప ఇంకెవరికీ వేయరు. అలాగే.. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా… జనసేనకు వేస్తారు. అయితే.. వీరిలో ఇంకో రకం ఉంటారు. జనసేన గెలవదు అనుకున్నప్పుడు.. తమ ఓటును ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో… జగన్ చేస్తున్న ప్రచారం వారి మైండ్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. జనసేనకు ఓటు వేయడం వల్ల.. లాభం లేదనుకున్నప్పుడు… పవన్ కల్యాణ్‌కి.. చంద్రబాబు మిత్రుడు కాబట్టి.. ఆయనకు ఓటు వేయాలన్న అభిప్రాయానికి వారు వచ్చే అవకాశం ఉంది. పవన్ కల‌్యాణ్‌ను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు కూడా.. పవన్ ను దూరం చేసుకుని మిస్టేక్ చేశారు. తర్వాత తెలుసుకుని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు.. పవన్ ను కూటమిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయకపోయినా… విమర్శించడం లేదు. ఎందుకంటే.. తన ఓట్లు జనసేనకు వెళ్లవు. కానీ సాఫ్ట్‌గా ఉండటం వల్ల. జనసేన ఓట్లు .. టీడీపీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నట్లు తెలుస్తోంది.

రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉన్న చోట జనసైనికులు ఎటు వైపు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చాలా… నారో కాంటెస్ట్ జరుగుతోంది. వెయ్యి, రెండు వేల ఓట్ల తేడాతో.. గెలుపోటములు నిర్ణయమయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. ఆ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఇష్టం లేకపోతే… జనసేన కార్యకర్త ఏం చేస్తారు..? లేకపోతే.. అక్కడ జనసేన అభ్యర్థి లేరు.. మిత్రపక్షాల అభ్యర్థి ఉన్నారనుకోండి.. అక్కడ టీడీపీ అభ్యర్ధో, వైసీపీ అభ్యర్థో… మంచి వ్యక్తి ఉన్నారనుకోండి.. ఆయనకు వేస్తారు. ఖమ్మం లాంటి చోట్ల.. కమ్యూనిస్టులకు పదివేల సభ్యత్వం ఉంటే.. ఐదు వేల ఓట్లు వస్తాయి. ఆ ఐదు వేల ఓట్లు స్ప్లిట్ అయిపోతాయి. ఇక్కడ కూడా అంతే. అందుకే.. తమ పార్టీ తరపున బలమైన అభ్యర్థి బరిలో లేరనుకుంటే… ఇతర పార్టీల వైపు …చూస్తారు. వారిలో తమ పార్టీకి సన్నిహితంగా ఉంటారు అనుకున్న వారికే ఓటు వేస్తారు. దీన్ని చూస్తే.. పవన్ కల్యాణ్‌ను అదే పనిగా విమర్శించడం వల్ల.. జగన్మోహన్ రెడ్డికి.. అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.