ప్రొ.నాగేశ్వర్ : సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాదాన్ని అంతం చేయలేకపోయాయా..?

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. గతంలో… పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో… భారీ ఎత్తున సర్జికల్ స్టైక్స్ చేశామని.. ప్రభుత్వం ప్రకటించుకుంది. ఈ కారణంగా ఉగ్రవాదం తగ్గిపోతుందని… ప్రకటించాయి. కానీ.. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా.. ఉగ్రవాదం తగ్గలేదు. దీంతో.. సర్జికల్ స్ట్రైక్స్ తో.. పాకిస్థాన్‌కు బుద్ది రాలేదని తేలిపోయింది.

సర్జికల్ స్ట్రైక్స్ పై రాజకీయ ప్రచారం రివర్స్ అయిందా..?

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పి.. దశాబ్దాలుగా రగులుతున్న కశ్మీర్ సమస్యకు ఓ పరిష్కారం రావాలంటే.. ఓ సర్జికల్ స్టైక్‌తోనే.. మరో విమర్శతోనే సాధ్యం అయ్యే పని కాదు. కానీ ప్రభుత్వం .. పాకిస్థాన్ భూభాగంలోని… ఉగ్రవాద క్యాంపులపై భారీ సర్జికల్ స్టైక్స్ చేశామని.. ఆ దెబ్బతో ఉగ్రవాదం తుడిచి పెట్టుకుని పోతుదంని ప్రచారం చేసుకుంది. దృశ్యాలను సోషల్ మీడియాలో లీక్ చేశారు. సినిమాలు తీశారు. నిజానికి ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి… గత ప్రభుత్వాల హయాంలోనూ జరిగాయి. కానీ ఆయా ప్రభుత్వాలు.. దీన్ని రాజకీయానికి వాడుకోదగ్గ అంశం అని అనుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం ఓ సర్జికల్ స్ట్రైక్ చేసి.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. దేశ భద్రతతో రాజకీయం చేసింది. ఆ సర్జికల్ స్ట్రైక్‌ను ప్రచారం చేసుకోకపోవడంతో.. ఇప్పుడీ ప్రశ్న వచ్చేది కాదు. అలాగే.. ఉగ్రవాదంపై తాము విజయం సాధించేశామన్నట్లుగా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ.. పుల్వామా దాడి ఘటనతో.. అది సాధ్యం కాదని తేలిపోయింది. ఏ ప్రభుత్వం ఉన్నా.. ఉగ్రవాదులు విరుచుకుపడుతూనే ఉన్నారు. కానీ.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వంలో దాడులు ఉన్నాయి.. తాము వచ్చిన తర్వాత దాడులు ఆగిపోయాయన్న.. రాజకీయ ప్రచారాన్ని చాలా ఉద్ధృతంగా చేశారు. దీన్ని ప్రశ్నించాలి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రచార అంశాలను తొలగించాలి. సర్జికల్ స్ట్రైక్స్ గురించి విపరీతంగా ప్రచారం చేసుకుంటే.. పాకిస్థాన్‌ను రెచ్చగొట్టినట్లు కాదా..?. ప్రతీకారం తీర్చుకోవాలన్న ఒత్తిడి వారిపై ఇలాంటి ప్రచారం ద్వారా పడుతుంది. అంతిమంగా దాడులకు కారణం అవుతాయి. అందువల్ల జాతీయభద్రతకు సంబంధించిన వ్యవహారాలు… ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంంగా జరగాలి. కానీ మన దేశంలో… దేశ భద్రతనూ.. రాజకీయాలకు వాడుకుంటూ ఉంటారు.

పాకిస్థాన్ విషయంలో ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం ఉందా..?

పాకిస్థాన్ విషయంలో… బీజేపీ ప్రభుత్వానికి ఓ స్పష్టమైన విధానం లేదనే విమర్శ మొదటి నుంచి ఉంది. దీనికి కారణం ఏమిటంటే… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. నేరుగా.. అప్పట్లో ఓ సారి… పాకిస్థాన్ వెళ్లిపోయి.. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో.. శుభకార్యానికి హాజరవుతారు. కౌగిలించుకుంటారు. కానీ..ఢిల్లీలో సమస్య పరిష్కారానికి చర్చల దగ్గరకు వచ్చే సరికి.. ఏదో ఓ కారణం చెప్పి చర్చలను రద్దు చేసుకున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోంది కాబట్టి.. తాము చర్చలను రద్దు చేశామని.. ప్రభుత్వం ప్రకటించింది. తాము గొప్ప దేశభక్తులుగా చెప్పుకుంది. కానీ గతంలో.. బీజేపీ నుంచే ప్రధానిగా ఉన్న వాజ్‌పేయి..ఇంత కన్నా… నిర్మాణాత్మకంగా వ్యవహరించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపారు. కొన్నాళ్ల క్రితం సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఎదురు దాడి చేయబోతున్నామన్న సంకేతం పంపారు. ఇలా.. పాకిస్థాన్ విషయంలో.. నికరమైన విధానం లేకపోవడం వల్లే అసలు సమస్య వస్తోంది. పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా.. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది. ఓ రాజ్యంగా విఫలమయింది. ఓ దుర్మార్గమైన రాజ్యం అంది. అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రవాదులు నడుపుతున్నారు. ఈ వాస్తవం మనకు తెలుసు. అలాంటప్పుడు… ఓ స్థిరమైన విధానం ఉండాలి. సరిహద్దుల్లో తుపాకులకు తుపాకులతో సమాధానం చెప్పాలి. సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలో తప్పు లేదు. రాజకీయ ప్రచారం చేసుకోవడమే తప్పు కానీ.. ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ అయినా చేయవచ్చు.

పాకిస్థాన్ విషయంలో ప్రభుత్వం ఇప్పుడేం చేయాలి..?

అంతర్జాతీయంగా పాకిస్థాన్‌తో ఎలా వ్యవహరించాలన్నదానిపై.. ఓ స్పష్టమైన విధానం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. ఎన్నికలకు ముందు చర్చలమీ ఉండవు.. ఇక అమీ తుమీ తేల్చుకుందాం అన్నట్లుగా ప్రభుత్వాలు ఉంటాయి… ఎన్నికలైన తర్వాత పాకిస్థాన్ తో చర్చలు జరుపుతామని ప్రకటిస్తాయి. గతంలో దాదాపుగా అన్ని ప్రభుత్వాలు చేశాయి. ఇప్పుడు.. కూడా.. పాకిస్థాన్ పై ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేసినా.. వచ్చే ఎన్నికల తర్వాత.. పాకిస్థాన్ తో చర్చలు జరుగుతాయని… ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్ లోనూ అదే పరిస్థితి. ఇమ్రాన్ ఖాన్… ఎన్నికలకు ముందు ఓ మాట.. ఆ తర్వాత మరో మాట మాట్లాడారు. అందుకే… పాకిస్థాన్ విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై.. ఓ స్పష్టమైన విధానం ప్రభుత్వానికి ఉండాలి. తుపాకీకి తుపాకీతోనే సమాధానం చెప్పాలి. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మద్దతు దక్కకుండా చేయాలి. అలాగే… కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పాలి. ఇది రెండు దేశాల మధ్య ఉండే అంశంగానే ఉంది. పాకిస్థాన్‌తో చర్చలు జరపబోమని… పదే పదే ప్రకటించాల్సిన అవసరం ఏముంది..?. దీని వల్ల తాము.. శాంతికి సిద్ఘంగా ఉన్నా… భారతే.. హింసాత్మక దృష్టితో ఉందని.. పాకిస్తాన్ ప్రపంచం ముందు చెప్పుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచానికి భారత్ శాంతి కోరుకుంటోందనే అభిప్రాయం తెలియచెప్పి.. ప్రజల మనసు గెలుచుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.