కేసీఆర్ సర్కార్‌కు చిక్కులు తెచ్చి పెడుతున్న ప్రాజెక్ట్ ప్రమాదాలు..!

తెలంగాణలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో బ్లాస్టింగ్ జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ దుమారం కూడా ప్రారంభమయింది. ఆ ప్రాజెక్టును చూసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణలను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేశారు. మునిగిపోయిన ప్రాజెక్ట్‌ను చూస్తే తప్పేమిటని… విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం నుంచి నీరు తీసుకునేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎల్లూరు వద్ద ఉంది. ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం నిర్మిస్తోంది. ఈ పథకంలో భాగంగా పంపుహౌస్‌తో పాటు అప్రోచ్‌ చానల్‌ ఎల్లూరు ఎత్తిపోతలకు సమీపంలోనే నిర్మిస్తున్నారు.

అయితే.. భూగర్భంలో వాటిని నిర్మించాలని అనుకోవడంతోనే సమస్య వచ్చింది. భూగర్భంలో నిర్మించడానికి బ్లాస్టింగ్ చేశారు. దీంతో కల్వకుర్తి పంపుహౌస్​లో పగుళ్లు వచ్చి మోటార్లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. అక్కడ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్న తీవ్ర నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరించినా పనులు చేయడంతోనే సమస్య వచ్చింది. ఆ కాంట్రాక్టర్‌కు లబ్ది చేకూర్చడానికే.. ప్రత్యేకంగా తప్పుడు నివేదికలు తప్పించి మరీ ప్రాజెక్ట్ బ్లాస్టింగ్ చేయించారని రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతోఇప్పుడు కాంట్రాక్టర్ అంశం కూడా హైలెట్ అవుతోంది. ఈ విషయాన్ని వీలైనంతగా లోప్రోపైల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు నీట మునిగిన ఎత్తిపోతలను ఖాళీ చేయడం సాధ్యం కాదు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గితేనే నీటిని తొలగించి మోటార్లు బయటికి తీయగలుగుతారు. ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా.. ఆ పంప్ హౌస్‌ను పరిశీలించడానికి వెళ్లారు. అయితే ప్రభుత్ం వారిని అక్కడి వరకూ వెళ్లనీయలేదు. గతంలో శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు కూడా రాజకీయ దుమారం రేగింది.తాజాగా.. మరో ప్రాజెక్టులోనూ ప్రమాదం జరగడం..ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంపై వీలైనంతగా లో ప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేయడానికి ప్రభుత్వం అరెస్టులతో ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

HOT NEWS

[X] Close
[X] Close