ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ పై వున్న కమెడియన్స్ లో థర్టీ ఇయర్స్ పృథ్వీ ఒకడు. వరుస సినిమాలతో చెలరేగిపోతున్నాడు పృథ్వీ. ప్రస్తుతం బ్యాడ్ ఫాం లో వున్న బ్రాహ్మీకి ప్రత్యాన్నయంగా ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో సక్సెస్ అవుతున్నాడు. బాయిలింగ్ స్టార్ బబ్లు,ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప.. మల్లెపుష్పం రామారావు.. ఇగో రెడ్డి, సింగం సుజాత… ఇలా పాత్రల పేర్లు గుర్తుండిపోయే సినిమాలు పడుతున్నాయి పృథ్వీకి. ఈ వారం కూడా పృధ్వీ హంగామానే కనిపించింది.
ఈ వారం మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. మంచు మనోజ్ గుంటూరోడు. రాజ్ తరుణ్ కిట్టు వున్నాడు, విజయ్ దేవరకొండ ద్వారక. ఈ మూడు సినిమాలో పృథ్వీకి మంచి పాత్రలు దక్కాయి. గుంటూరోడులో ఒక మాదిరగా అనిపించింది కానీ కిట్టు వున్నాడు,ద్వారక చిత్రాలకు మెయిన్ ఎసెట్ గా నిలిచాడు పృధ్వీ. జనరల్ గా పృధ్వీని ఎక్కువాగా స్పూఫ్ కోసం వాడుకుంటారు. కాని కిట్టుగాడులో మరో యాంగిల్ చూపించాడు. తనదైన డిక్షన్ తో నవ్వులు పూయించాడు. ద్వరాకలో కూడా అంతే. ఈ రెండు చిత్రాలకు స్పూఫ్ కామెడి ప్రధాన బలం అంటే అతిశయోక్తి కాదు. పృధ్వీ బీవత్సమైన యాక్టింగ్ ఏమీ చేయడు. ఆయన బలం టైమింగ్, మాటలో లైట్ జర్క్. ఈ రెండూ కూడా ఈ సినిమాలో సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ముఖ్యంగా కిట్టుగాడులో పృధ్వీని చూసిన తర్వాత ఆయన కోసం మరిన్ని విభిన్నమైన కామెడి ట్రాక్ లు రాసుకుంటారు అనడంలో సందేహం లేదు. మొత్తంమ్మీద ఈ వారం వచ్చిన చిత్రాల్లో నవ్వులు పంచడంలో సక్సెస్ అయ్యాడు పృథ్వీ.