పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా రిటైర్మెంట్ వరకూ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్ అనిపించుకున్న ఆయన చివరికి జగన్ రెడ్డి పాలబడి.. చేయకూడని ఘోరమైన తప్పులు చేశారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండి..చేసిన ఘోరాలతో ఆయన సర్వీసుని ఘోరంగా ముగించబోతున్నారు. ఇప్పటికే జైలుశిక్ష అనుభవించారు. ఆరోగ్య కారణాలతో జైలు బయటకు వచ్చారు. జగన్ రెడ్డితో కలిసి పని చేస్తే నిప్పుకు అయిన చెద పడుతుందని పీఎస్సార్ ను చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. క్రిమినల్ మైండ్ సెట్ ను చదివి .. దానికితగ్గట్లుగా సమాజాన్ని కాపాడే పని చేయాల్సిన పీఎస్సార్ లాంటి వాళ్లు ఇలా.. క్రిమినల్ మైండ్ సెంట్ ఉన్న వారి చేతుల్లో పావుగా మారి జీవితాన్ని నాశనం చేసుకోవడం …. సర్వీసులో ఉన్న వారందరికీ ఓ గుణపాఠం.
జగన్ హయాంలో పోలీస్ మాఫియా
ఓ నటిపై తప్పుడు కేసులు పెట్టి ముంబై నుంచి ఎత్తుకొచ్చి చేసిన దారుణాల గురించి బయటకు తెలిసింది కొంతే. మాఫియా గ్యాంగులు ఎలా చేస్తాయో అలా చేశారు. అది కేవలం కేసు మాత్రమే. అంత కంటే ఘోరంగా చేసినవి ఎన్నో ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడులతో హత్యాయత్నాలకు పీఎస్సార్ మాస్టర్ మైండ్ అని గట్టి ఆరోపణలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జోక్యం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రతిపక్ష నేతలపై నిఘా వంటి అంశాలు ఆయన కెరీర్‌పై మాయని మచ్చగా మిగిలాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎదురయ్యే పర్యవసానాలకు పీఎస్ఆర్ ఒక ఉదాహరణగా నిలిచారు.
రాజకీయ బాసుల కోసం దారి తప్పిన పీఎస్సాఆర్
కేవలం రాజకీయ పెద్దల మెప్పు కోసం నిబంధనలను తుంగలో తొక్కిన అధికారులు చివరకు ఎలా ఒంటరి అవుతారో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. గతంలో జైలు శిక్ష అనుభవించడం, ప్రస్తుతం తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ విచారణలు ఎదుర్కోవడం ఆయన వ్యక్తిగత , వృత్తిగత జీవితాన్ని దెబ్బతీశాయి. రాజకీయ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత, అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందనే పచ్చి నిజాన్ని పీఎస్ఆర్ ఆంజనేయులు ఉదంతం మరోసారి నిరూపించింది.
సర్వీసులో ఉన్న వారికి గుణపాఠం
ఈ పరిణామాలు ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఇతర అధికారులకు ఒక గట్టి హెచ్చరిక , గుణపాఠం. వ్యవస్థలు ఎంత శక్తివంతమైనవైనా, రాజ్యాంగం ,చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని ఈ విశ్లేషణ చెపుతోంది. ఒక అధికారి తన క్రిమినల్ మైండ్ ను సమాజ రక్షణకు వాడకుండా, రాజకీయ కక్షసాధింపులకు వాడితే ఆఖరి దశలో ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆగిపోయే అవకాశం ఉండటం వల్ల ఆర్థికంగా ,సామాజికంగా ఆయన పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది.


