ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) లో జరిగిన అక్రమాల కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను విజయవాడ కోర్టు కొట్టివేసింది.
వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్ష పత్రాల మూల్యాంకనం కేసులో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్ఆర్ ఆంజనేయులుపై కేసు నమోదైంది. ఇటీవలే ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయన బెయిల్ కోసం విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు…ఇరువర్గాల వాదనలు విని తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ముంబయి నటిని వేధించిన కేసుతోపాటు,గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసుల్లో,పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.