చైతన్య : ఇన్‌స్టంట్ న్యాయాలకు ప్రజల మద్దతు ఎందుకు లభిస్తుందో న్యాయవ్యవస్థ గుర్తిస్తుందా ?

యూపీలో మాఫియా డాన్స్ అయిన అతీక్ బ్రదర్స్ ను అందరి ముందు కాల్చి చంపారు. పోలీసులు చంపితే ఎన్ కౌంటర్ అనుకుంటారు. కానీ చంపింది రౌడీలే. ఎలా చంపారో అన్నదానిపై అనేక డౌట్స్ ఉన్నాయి… ఆ క్రెడిట్ అంతా యూపీ ప్రభుత్వానికి సీఎం యోగికి ఇస్తున్నారు. యూపీలో ఇలా 200 మంది గ్యాంగ్ స్టర్లను చంపేశారు. అక్కడ ప్రజా వ్యతిరేకత రాలేదు. ఇంకా మద్దతు వచ్చింది. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే వచ్చే ముప్పు గురించి తెలుసు కాబట్టి మానవహక్కుల సంఘాలు.. ఇతరులు వ్యతిరేకించారు. హైదరాబాద్‌లో దిశ ఎన్ కౌంటర్ విషయంలోనూ అదే జరిగింది. ప్రజలు మద్దతిచ్చారని ఎన్ కౌంటర్ చేసేశారు. ప్రజలు ఇలాంటి ఇన్ స్టంట్ న్యాయాలను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.

నేరస్తులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజల్లో సడలిపోతోంది !

ప్రజలు ఎన్ కౌంటర్ల లాంటి ఇన్ స్టంట్ న్యాయాన్ని సమర్థించడానికి ప్రధాన కారణం.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెడితే విచారణ ఎంత కాలం జరుగుతుదో తెలియదు. చివరికి శిక్ష పడుతుందో లేదో తెలియదు. నిన్నటికి నిన్న గిరిజనులపై పోలీసులు చేసిన దాష్టీకం వాకపల్లి కేసులో కోర్టు తీర్పు చూసిన ఎవరికైనా… ఇదా మన పరిస్థితి అనిపించక మానదు. ఇక డబ్బు, పవర్ ఉన్న వాళ్లకు అసలు శిక్షలు పడతాయని ఎవరూ అనుకోవడం లేదు. హై ప్రోఫైల్ కేసుల్లో కోర్టులు వ్యవహరిస్తున్న తీరుతో నిందితులు ఎంత ధీమాగా ఉంటున్నారో తాజా కేసుల విచారణలే స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగా నేరస్తులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజల్లో సడిలిపోతోంది.

నేరస్తులు అన్ని నేరాలు చేసే వరకూ ఎలా ఉపేక్షిస్తున్నారు ?

అతీక్ అహ్మద్ మాఫియా డాన్.. అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. మరి వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి ? . ఆయన దెబ్బకు వ్యవస్థకు కూడా భయపడిపోయాయా..? మొదటి నేరం చేసినప్పుడే కఠినంగా ఉంటే పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చేది కాదు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కూడా అయ్యారు. ఇక తిరుగేమి ఉంటుంది. ఇలా రాజకీయాల్లో దారుణ హత్యలు చేసే మైండ్ సెట్ ఉన్న వారిని మొదటే వ్యవస్థలు శిక్షిస్తే.. తర్వాత అంతకంటే దారుణమైన నేరాలు జరగకుండా కట్టడి చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలు జరగడంలేదు. వ్యవస్థలన్నీ కలసి కట్టుగా విఫలమవడం దీనికి సంకేతం.

ఒక్క ఎన్ కౌంటర్ నిజం కాదు.. కానీ ప్రజల మద్దతు !

యూపీలో జరిగిన ఏ ఒక్క ఎన్ కౌంటర్ కానీ.. రౌడీ షీటర్ల హత్యలు కానీ పూర్తి స్క్రిప్టెడ్. అందులో డౌట్ లేదు. ఆయితే ఇలాంటి ఎన్ కౌంటర్లపై మానవహక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది కానీ సామాన్య ప్రజల నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకత రావట్లేదు. పైగా ప్రజల నుంచి సపోర్ట్ లభిస్తోంది. ఎందుకంటే … వారిని భయపెట్టి.. ప్రశాంత జీవనం లేకుండా చేసే వారిని తమ చుట్టూలేకుండా చేశారనే సంతృప్తి వారికి ఉంటుంది. ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికి స్థానిక ప్రజల ప్రశంసలు మాత్రం పొందుతోంది. అతీక్ హత్య విషయంలోనూ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అది యోగి ప్రభుత్వమే ప్లాన్డ్ గా చేయించిందని పాత నేరస్తులతో ఈ పని చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆ నేరస్తులు ప్రజల్లోఅంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వారు చనిపోయినా ఎవరూ సానుభూతి తెలిపే పరిస్థితి లేదు.

న్యాయవ్యవస్థ విఫలమైతే… ఇక అరాచకమే !

ప్రజలు మద్దతుగా ఉంటున్నారని .. ఇలా తప్పు చేసినప్రతి ఒక్కరికీ ఇన్ స్టంట్ శిక్షలు విధిస్తూ పోతే ఇక చట్టం, న్యాయం ఎందుకు .. న్యాయస్థానాలు ఎందుకు అనే ప్రశ్న వస్తోంది. ఇదెంత ప్రమాదకరమైన సలహానో ఎవరూ ఊహించడం లేదు. ఈ పరిస్థితినే పోలీసులు రేపు అమాయకుల్ని వధించడానికి..వేధించడానికి వాడుకునే ప్రమాదం ఉంది. రాజకీయ నాయుకుల రాజకీయ ప్రత్యర్థుల్ని హతమార్చడానికి వాడుకోరనే గ్యారంటీలేదు. కుక్కను చంపేముందు పిచ్చిది అనే ముద్ర వేసినట్లుగా… ఇలా టార్గెటెడ్ నేతల్ని చంపే ముందు నేరస్తుడనే ముద్ర వేసి పని పూర్తి చేస్తారు రాజకీయం ఇప్పుడు అంతా నేరగాళ్ల మయం. అన్ని వ్యవస్థలు పూర్తిగా నేరగాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయన్నమాట నిజం. ఆ పరిస్థితిని నిలువరించకపోతే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పెనుముప్పు పొంచి ఉన్నట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close