జగన్ రెడ్డి డోన్ వెళ్లారు. అయితే అది రాజకీయ యాత్ర కాదు. పరామర్శ యాత్ర అంత కన్నా కాదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొడుకు పెళ్లి అయింది. ఆ పెళ్లి రిసెప్షన్ కు వెళ్లారు. కానీ టార్గెట్ పెట్టుకుని మరీ జన సమీకరణ చేశారు. జగన్ కు నచ్చిన పుష్ప సినిమా డైలాగులుతో పోస్టర్లు వేసుకున్నారు. పెళ్లి వేదికను కూడా రాజకీయ సభా వేదికగా ఏర్పాట్లు చేశారు. అచ్చంగా రాజకీయ కార్యక్రమానికి వచ్చి వెళ్లినట్లే జగన్ వ్యవహరించారు.
జగన్ రెడ్డి ఓ ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నారు. తాను బయటకు వెళ్లినప్పుడు చుట్టూ జనం కనిపించకపోతే తనను ఎవరూ పట్టించుకోవడంలేదని అందరూ అనుకుంటారని ఫీలవుతున్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా జన సమీకరణ చేయాలని పార్టీ నేతలకు సమాచారం ఇస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలకు అయితే ముందుగానే టార్గెట్లు పెడుతున్నారు. చివరికి పెళ్లిళ్లకూ ఇలా జనసమీకరణ చేయాలని ఆదేశాలు రావడం పార్టీ నేతల్ని విస్మయానికి గురి చేసింది.
రాజకీయాలు ఎలా జరుగుతాయో ఇప్పుడు ప్రజలకు అవగాహన ఉంది. చుట్టూ జనం మూగేసి ఉన్నారని ఆయన క్రేజ్ ఓ లెవల్లో ఉందని సోషల్ మీడియాలో వీడియోలు వేసుకుంటే నమ్మేసే పరిస్థితి లేదు. కానీ ఎవరూ పట్టించుకోకపోతే పరువుపోతుందని జగన్ భయపడుతున్నారు. ఆయనతో రకమైన ఆత్మన్యూనతా భాగమని అందుకే.. ఎక్కడికి వెళ్లిన జన సమీకరణ కోసం పట్టుబడుతున్నారని వైసీపీ వర్గాలు గొణుక్కుంటున్నాయి.