నేతల్ని పక్కన పెట్టి ఏపీ ఉద్యోగులు రోడ్డెక్కితే ప్రజల మద్దతు !

ఏపీ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఓ వైపు తమకు ఇవ్వాల్సిన జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా.. అసలు ఉద్యోగులు పని చేస్తారా.. జీతంతో వారికి పనేముంది.. లంచాలే లక్షల్లో వస్తాయన్నట్లుగా ప్రచారం చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. కానీ ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి వెనుకాడుతున్నారు. పీఆర్సీ సమయంలో చేసిన ఉద్యమాన్ని ఉద్యోగ నేతలు అమ్ముకున్నారన్న అభిప్రాయంతో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు మళ్లీ వాళ్లే … వచ్చి ఉద్యమం అంటూంటే పెద్దగా నమ్మలేకపోతున్నారు.

ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్మును ఇప్పటి వరకూ ఇవ్వలేదు. సీపీఎస్ సొమ్మును కాజేశారు. రుణాలు , అడ్వాన్సుల కోసం పెట్టిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకుని బ్యాంకుల నుంచి అప్పు తీసుకోమని చెబుతున్నారు. ఎన్నో రకమైన అర్థిక నష్టాలకు తోడు. తమపై దుష్ప్రచారం చేస్తూండటంతో ఉద్యోగులు నలిగిపోతున్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేఆర్ సూర్యనారాయణ వంటి వారు తెరపైకి వచ్చి ఇక సహించేది లేదని చెబుతున్నారు. బండి శ్రీనివాసరావు,, వెంకట్రామిరెడ్డి మాత్రం తాము జగన్మోహన్ రెడ్డికి బంటులమని చెబుతున్నారు. అందుకే ఉద్యోగులు నమ్మలేకపోతున్నారు.

అయితే ఉద్యోగ సంఘం నేతల్ని పక్కన పెట్టి ఉద్యోగులే సమైక్యంగా రోడ్డెక్కితే ప్రజల నుంచి ఊహించనంత స్థాయిలో మద్దతు లభిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో చలో విజయవాడ పెట్టినప్పుడు ప్రజలే పెద్ద ెత్తున సహకరించారు. మరోసారి ఉద్యోగ నేతలు ఉద్యమాన్ని నడిపితే ప్రజల నుంచి అలాంటి సహకారం లభించదు. ఉద్యోగులే ముందుకు రావాల్సి ఉంది. అదే జరిగితే ప్రభుత్వంలోనూ కదలిక వస్తుంది. లేకపోతే… ఉద్యోగులు .. తమ ప్రయోజనాల్ని ప్రభుత్వానికి భయపడి.. వదులుకోవాల్సిందే. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష ఐటెమ్ గాళ్‌… దొరికేసింది!

సుకుమార్ సినిమాల్లో స్క్రీన్ ప్లే త‌ర‌వాత‌, ఐటెమ్ పాటే హైలెట్టు. 'ఆ అంటే అమ‌లాపురం' ద‌గ్గ‌ర్నుంచి 'ఊ అంటావా' వ‌ర‌కూ ఆయ‌న ఇచ్చిన అన్ని పాట‌లూ హిట్టే. మిగిలిన సినిమాల్లో ఐటెమ్ పాట...

సజ్జల రిలాక్స్ అయ్యారా ? చక్కబెడుతున్నారా ?

కుట్రల స్ట్రాటజిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదు. ఏ చిన్నది జరిగినా ఆయన మీడియా ముందుకు వచ్చి అంతా టీడీపీనే చేసిందని చెప్పి పోతూంటారు. దేశవ్యాప్తంగా వైసీపీ ఇమేజ్...

పీకే Vs క‌ర‌ణ్ థాప‌ర్… సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఇంట‌ర్వ్యూ!

గ‌త కొంత‌కాలంగా మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్... దేశంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎన్ని ఏ పార్టీ పొజిష‌న్ ఏంటీ అన్న...

దేశమంతా వైసీపీ వైపే చూస్తోంది – అసహ్యంతో !

జగన్ మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తారంతే. ఇంకా చెప్పాలంటే... చెప్పిన డెడ్ లైన్ కంటే ముందే చేసేస్తారు. ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి ఎన్నికల ఫలితాలు దేశం మొత్తం షాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close