జై చలపతి బృందం- వివాదంలో స్వీయ ప్రచారం

మహిళలపై నటుడు చలపతిరావు చేసిన వికృత వ్యాఖ్యలను అందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఆయన కూడా కాస్త అటూ ఇటూ మాట్లాడినా చివరకు బేషరతుగా క్షమాపణలు చెప్పేశారు. కథ అక్కడికి అయిపోవలసింది. ఆ విషయమై మరెవరైనా విమర్శించినా అప్పటికే క్షమాపణ చెప్పారు గనక మళ్లీ వివాదాలకు ఆస్కారం వుండదు. కాని జరుగుతున్నదేమంటే ఆ తర్వాత జై చలపతి రావు తరహాలో ఒక బ్రిగేడ్‌ బయిలుదేరింది. చలపతి వ్యాఖ్యలు తప్పే గాని వాటిపై ఇంత దుమారం ఎందుకు? మరెవరూ తప్పు మాట్లాడరా అంటూ ఎదురుదాడి చేయడం ఈ బ్రిగేడ్‌ పనిగా పెట్టుకుంది.ఈ ఉదంతంలో భాగం పంచుకున్న సెలబ్రిటీ యాంకర్లు కూడా ఇదే నీతి చెబుతున్నారు. .చలపతిరావు కుటుంబ సభ్యులు సన్నిహితులు కొందరు కావాలనే ఈ ప్రహసనం నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. వారే చొరవ తీసుకుని స్టూడియోలకు వచ్చి మరీ ఆయనను సమర్థించి వెళుతున్నారు. అలాటి ఒకటి రెండు ఉదంతాలు నాకు స్పష్టంగా తెలుసు. ఇక మరో వైపున ఈ వూపులో కొందరు తమ స్వంత ప్రచారం చేసుకోవడానికి పాచికలు వేస్తున్నారు. సహజంగానే ఇలాటి రసవత్తర విషయాలు మాట్లాడటం ఇష్టమైన వారు కొందరుంటారు. మహిళలపై విరుచుకుపడ్డమే పురుష పుంగవుల కర్తవ్యంగా భావించే సంఘాల సారథులూ కొందరున్నారు. తమాషా ఏమంటే ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోవలసిన వివాదాన్ని ఇలాటి వారు మరింత సాగలాగడానికి కారణమైనారు. అలా అలా ఈ జుగుప్సాకర చర్చ సాగుతూనే వుంది.చలపతి రావు గతంలోనూ ఇలా మాట్లాడ్డం తెలుసని పరిశ్రమలో పండిపోయిన కొందరు స్పష్టంగా చెబుతున్నారు. రేప్‌ల గురించి ఆయన ఎంత అలవోకగా మాట్లాడారో ఒక ప్రసిద్ధ నాయిక పేరు పెట్టి మరీ ఆమెను ఎంతమంది రేప్‌చేశారో , అందుకు ప్రయత్నించారో తెలియదని ఆయన అనడం గతంలో గుర్తు చేశాను. కనుక సమస్య ఈ ఒక్క హీన వ్యాఖ్యమాత్రమే కాదు, ఆ ధోరణి. ఈ వాస్తవాలు గ్రహించి చలపతి బ్రిగేడ్‌ సమర్థనలు ఆపడం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close