ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి లేవనెత్తిన ప్రశ్నలు వింటే ఇవి నిజమేననిపిస్తోంది. కేంద్రాన్ని స్లీపింగ్ పార్ట్నర్ గా అభివర్ణించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలపై భారీ పనులు విధిస్తూ కేంద్రం దండిగా అర్జిస్తోందని కానీ… ఇన్వెస్టర్లు మాత్రం లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియకుండా పనులు మాత్రం చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చాడు. కేంద్రం ఒకరకంగా స్లీపింగ్ పార్ట్నర్ లా వ్యవహరిస్తోందని ఆవేదన వెళ్లగక్కారు.
ఎక్కడైనా ఇల్లు కొనుకోవాలనుకుంటే నగదు లావాదేవీలు సాధ్యపడటం లేదు.తమ దగ్గరనున్న వైట్ మనీ అన్ని ట్యాక్స్ లకు వెళ్ళగా, ఏదైనా కొనాలన్న పన్నుల మీద పన్నులు విధిస్తున్నారని, జీఎస్టీ వలన తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.అయితే దీనికి సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్ స్లీపింగ్ పార్ట్నర్లు సమాధానం ఏమిస్తారు అంటూ రిప్లై ఇచ్చారు.
దీంతో అక్కడున్న వారంతా ఆమె ఆన్సర్ విని విస్తుపోయారు . కేంద్ర పన్నులపై నిర్మలా సీతారామన్ ఏదైనా వివరణో లేక సమర్థనో ఇస్తారు అనుకుంటే బదులుగా సిల్లిగా ఆన్సర్ ఇచ్చి ఆమె విమర్శల్ని మూటగట్టుకున్నారు. దీనిపై ఇప్పుడు నెట్టింట తీవ్రమైన చర్చ జరుగుతోంది.
https://twitter.com/Qid_Memez/status/1790950953379901606?t=oCheRG7J3kBhJhFmqoGrxg&s=08