ఇతడి ప్రాణాలకు విలువ లేదా?

సెక్యులరిజం అంటే అన్ని మతాలనూ సమానంగా గౌరవించడం. కానీ ఓటు బ్యాంకు రాజకీయమే ముఖ్యమైన మన దేశంలో సెక్యులరిజం అర్థం మారిపోయింది. మైనారిటీలను మనుషుల్లా కాకుండా ఓట్లుగా చూడటం ఎక్కువైంది. దాద్రీ ఘటనలో ఓ ముస్లిం ప్రాణాలను కోల్పోవడంపై సెక్యులరిస్టు మేధావులు గుండెలు బాదుకున్నారు. మోడీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో, బురఖా వల్ల దొంగతనాలు పెరుగుతున్నాయని, ఒకే నెలలో ఇలాంటి అనేక కేసులు నమోదయ్యాయని వ్యాఖ్యానించిన ఓ ముస్లిం యువకుడిపై కేరళలో జరిగిన దాష్టీకం గురించి మాత్రం సెక్యలరిస్టు మేధావులు పట్టించుకోలేదు.

తాజగా మహారాష్ట్రలో ఓ హిందూ యువకుడిని ముగ్గురు మైనారిటీ యువకులు సజీవ దహనం చేశారు. కారణం, అతడు హిందువు కావడం. జనవరి 13న కాలిన గాయాలతో పుణేలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన అతడు, 15న తుది శ్వాస విడిచాడు. చెత్త ఏరుకుని జీవించే సావన్ రాథోడ్ అనే 17 ఏళ్ల బాలుడిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. అతడి పేరు అడిగారు. హిందువువా అని అడిగారు. అవును అనగానే బాటిల్ లోని పెట్రోల్ ను అతడి ఒంటిపై పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో బాధపడుతున్న అతడిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. రెండు రోజుల తర్వాత మరణించాడు. ఆ రోజు ఏం జరిగిందో సావన్ తనకు చెప్పాడని, ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని అతడి తండ్రి ధర్మ రాథోడ్ మీడియాకు చెప్పాడు. ఈ ఘటనకు ఆధారంగా ఓ వీడియో క్లిప్ ను పోలీసులకు ఇచ్చానని అతడు వివరించాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. వారి పేర్లు… ఇబ్రహీం షేక్, జుబేర్ తంబోలి, ఇమ్రాన్ తంబోలి. ఇంత దారుణ ఘటనపై సెక్యులరిస్టు మేధావులు ఎవరూ స్పందించలేదు. ఇది అమానవీయ చర్య అని ఖండించ లేదు. దాద్రీ ఘటన తర్వాత వందల సంఖ్యలో అవార్డ్ వాపస్ చేసిన వారెవరూ నోరు మెదపలేదు. ఒకవేళ, బాధితుడు మైనారిటీ వర్గానికి చెందిన వాడై, పెట్రోల్ పోసిన వారు హిందువులై ఉంటే కుహనా సెక్యులరిస్టులు గొడవ గొడవ చేసే వారు కాదా అని సమస్త హిందూ అఘాదీ అనే సంస్థ సభ్యులు ప్రశ్నించారు. రాడికల్ భావాలు గల మైనారిటీ యువకులు ఐసిస్ ఉగ్రవాదుల స్ఫూర్తితో ఈ పని చేసినట్టుందని వారు అభిప్రాయ పడ్డారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. దాద్రీ ఘటనలో మరణించిన వ్యక్తి ప్రాణాలకే విలువ ఉందా? ఈ బాలుడి ప్రాణాలకు విలువ లేదా అని సెక్యులరిస్టు మేధావులను హిందూ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close