చంద్రబాబుపై దాడిని తప్పు పట్టిన పురందేశ్వరి..!

ఈ టైటిల్ చూస్తే.. అసలు ఊహించని.. ఊహించడానికి సాధ్యపడని విషయం. కానీ ఇది.. నిజం.. రాజధాని పర్యటనలో.. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు వేయడాన్ని పురంధేశ్వరి తప్పు పట్టారు. నిరసన తెలుపువచ్చు కానీ.. ఇలా రాళ్లు, చెప్పులు వేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో.. పురంధేశ్వరి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. స్మశానంతో పోల్చడం.. ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని.. ఇసుక కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయని మండిపడ్డారు. రాజధానిపై నాన్చివేత ధోరణి, పోలవరంలో రివర్స్‌ టెండర్లు సరికాదన్నారు. వైసీపీపై.. పురంధేశ్వరి విమర్శలు పెద్ద విషయం కాకపోయినా.. చంద్రబాబుపై.. జరిగిన రాళ్లు, చెప్పుల దాడిని మాత్రం.. పురందేశ్వరిని.. ఖండిండం.. ఆసక్తికర పరిణామమే.

తెలుగుదేశం పార్టీ విషయంలో.. ముఖ్యంగా.. చంద్రబాబు విషయంలో.. ఎలాంటి ఘటనలు జరిగినప్పటికీ.. వాటికి వ్యతిరేకంగా.. స్పందించేతత్వం దగ్గుబాటి ఫ్యామిలీకి లేదు. చాలా కాలం నుంచి.. చంద్రబాబు, దగ్గుబాటి ఫ్యామిలీ నిప్పు-ఉప్పులా ఉంటారు. చంద్రబాబు పేరును కూడా.. పురందేశ్వరి ప్రస్తావించరని చెబుతూ ఉంటారు. అయితే.. ఇప్పుడు మాత్రం.. రాజధాని పర్యటనలో.. చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేయడాన్ని వ్యతిరేకించారు. అందుకే పలువురిలో.. ఈ అంశం ఆసక్తి కలిగిస్తోంది.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన.. దుగ్గబాటి వెంకటేశ్వరరావును.. అవమానకరంగా.. వైసీపీ నుంచి పంపే ప్రయత్నం చేశారు. దాంతో.. దగ్గుబాటి.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. పురందేశ్వరిని వైసీపీలోకి తీసుకు వస్తేనే.. పార్టీలో ఉండాలని చెప్పడంతో.. ఆయన సైలెంటయిపోయారు. తాను బీజేపీలోనే ఉంటానని పురందేశ్వరి తేల్చి చెప్పారు. ఈ క్రమంమలో.. చంద్రబాబుపై.. ఎప్పుడూ లేనంత సానుకూలత చూపడం.. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close