పూరి జగన్నాథ్…. ఈ దర్శకుడి టేకింగూ, మేకింగూ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వెండి తెరపై హీరోయిజం గుమ్మరించడంలో పూరి తరవాతే ఎవరైనా. పూరి టైటిళ్లు కూడా బాగుంటాయి. అందులో పొయెట్రీ ఉంటుంది. సెన్సిబులిటీ ఉంటుంది. ఆఖరికి తిట్టూ కనిపిస్తుంది. అమ్మా, నాన్న తమిళ అమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయెటిక్ టైటిళ్లు పెట్టిన పూరి.. ఇడియట్, పోరికి అంటూ తిట్టనే టైటిళ్లుగా మార్చాడు. ఈసారి మరో వెరైటీ టైటిల్ ఎంచుకొన్నాడు. అదే… ‘మూడు కోతులు, ఒక మేక’.
పూరి తన సొంత సంస్థ వైష్టో అకాడమీ పేరుమీద ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించాడు. ఇజం తరవాత పూరి సినిమా ఏదన్నది ఇంత వరకూ తేలలేదు. ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడనుకొన్నా.. అది పట్టాలెక్కలేదు. ఇజం దెబ్బకు స్టార్ హీరోలంతా పూరికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కొత్తవాళ్లతో ఓ సినిమా చేయాలని పూరి నిర్ణయించుకొన్నాడట. అందుకోసం ముగ్గురు హీరోల్ని వెదికే పనిలో పడ్డాడు. నాగశౌర్య, నిఖిల్.. ఇలాంటి వర్థమాన హీరోల లిస్టు ఒకటి తయారు చేసుకొని.. తన క్యారెక్టర్లకు సరిపడా వాళ్లని ఎంచుకొనే పలిలో ఉన్నాడు పూరి. టైటిల్ అయితే ఆసక్తిని రేకెత్తిస్తోంది. కథ, కథనాల్లో కూడా పూరి వైవిధ్యం చూపించగలిగితే.. పూరి ఈజ్ బ్యాక్ అని గర్వంగా చెప్పుకోవొచ్చు. మరి అందుకు అవకాశం ఇస్తాడో, లేదో??