చైతన్య : నష్టాలొచ్చినప్పుడు వేదాంతాలు – లాభాలొచ్చినప్పుడు పార్టీలా .. పూరీ ?

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పావలా కోడికి చారాణా మసాలా తరహాలో సినిమా తీసి.. మొత్తం నాకించేసిన పూరి జగన్నాథ్ .. బయ్యర్లను, ఫైనాన్షియర్లను నిండా ముంచేశారు. వారికి ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ధర్నాకు ప్లాన్ చేసుకున్నారు. వారెక్కడ ధర్నా చేస్తారోనని పూరీ జగన్నాథ్ ప్రాణభయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ కల్పించుకున్నారు. ఈ ఎపిసోడ్ మధ్యలో ఓ వేదాంతం రాఘవయ్యలా ఓ నోట్ విడుదల చేశారు. పూరీ మ్యూజింగ్స్‌లో దాచుకోవడానికి అది బాగానే ఉంటుంది కానీ సమస్యను పరిష్కరిస్తుందా ? హిట్ వచ్చినప్పుడు పార్టీలు చేసుకుని.. నష్టాలొచ్చినప్పుడు ఈ వేదాంతాలు చెబితే సరిపోతుందా ?

డబ్బును తీసుకెళ్లలేం కానీ ఆ డబ్బుకు గౌరవం ఇవ్వాల్సిందే పూరీ సారూ !

డబ్బును తీసుకెళ్లే ఒక్కరిని చూపించండి .. దాచుకుంటానని పూరీ జగన్నాథ్ సవాల్ చేశారు. పూరీ జగన్నాథ్ దాచుకున్నా.. దాచుకోకపోయినా.. ఎవరూ ఏమీ తీసుకెళ్లరు. అంత మాత్రానికే వేరే వాళ్లు దాచుకున్నది.. సంపాదించుకున్నది కూడా నేనే తగలెస్తానంటే ఎట్లా సారు ? ప్రపంచంలో ప్రతి ఒక్కరి పరుగు డబ్బు కోసమే. ఆ డబ్బు ఉంటేనే చాలా వరకూ జీవితాలు ప్రశాంతంగా సాగుతాయి. అంబానీనే కాదు.. ఆయన తర్వాత పది తరాలు కూర్చుని తిన్నా కరగనంత సంపద ఉంది. మరి వారెందుకు కష్టపడుతున్నారు ? అనుక్షణం లాభాల కోసం ఎందుకు తపన పడుతున్నారు ? తనతో పాటు తీసుకెళ్తానని అంబానీ అనుకుంటారా ? కానే కాదు.. రూపాయి అనే దాంట్లో లైఫ్ ఉంది. జీవితం ఆస్వాదించడం ఉంది. ఎంత సంపాదిస్తే అంత మందికి ఉపాధి లభిస్తుంది. అన్ని కుటుంబాలు బాగుపడతాయి. అంబానీ నాకిది చాలు అని కూర్చుకుంటే.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. అదీ డబ్బు చూసే కోణం. రూపాయి తీసుకెళ్తారా లేదా అన్నది మిడిమిడి జ్ఞానం మేధావులు చెప్పే మాట.

రిస్క్ చేయాలి బాస్.. వేరే వాళ్ల జీవితాల్ని రిస్క్ లో పెట్టి కాదు !

రిస్క్ .. రిస్క్.. ఇది లేకపోతే లైఫ్‌లో సక్సెస్ లేదన్నారు పూరి. ఎంత రిస్క్‌కు అంత సక్సెస్ అనే సిద్దాంతం కూడా చెప్పారు. కావొచ్చు. ఆ రిస్క్ ఎప్పుడు చేయాలి. ఆ రిస్క్ వల్ల వచ్చే సక్సెస్ మొత్తం తనకే వస్తున్నప్పుడు.. దాని వల్ల వచ్చే నష్టం కూడా తానే భరించేలా ఉన్నప్పుడే రిస్క్ చేయాలి. తన రిస్క్ కు వేరే వాళ్లను నష్టపరిచి.. రిస్క్ చేయాలి భాయ్ అని చెప్పి తప్పుకోవడం .. చేతకానితనం అవుతుంది. అంతకు మించి ఇలాంటి స్వామీజీల్లా ఇలాంటి ఫిలాసఫీలు చెప్పడం… పరారవడం అవుతుంది.

జీవితం అందరికీ అన్నీ చూపిస్తుంది బాసూ.. నీకొక్కడికే కాదు !

పూరీ జగన్నాథ్.. ఏదో తన జీవితంలో మాత్రం ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నట్లుగా చెబుతున్నారు. కానీ జీవితం ఎవరికీ సాఫీగా ఉండదు. అన్నీ ఉంటాయి ఎవరి స్థాయిలో వారికుంటాయి. ఎవరి రేంజ్‌లో వారి కుంటాయి. అదేదో ఎవరికీ ఉండవన్నట్లుగా అన్నీ తెచ్చుకోమని సలహాలిస్తున్నారు పూరీ సారు. ఎవడి జీవితానికి వాడే హీరో. ఆ విషయం పూరీకి ఇంకా తెలియలేదేమో… ఎవరికి వారు హీరోలాగానే బతుకుతూంటారు. వాడి సినిమాలో పూరీ కూడా సైడ్ క్యారెక్టరే. అంతెందుకు.. ఏ మాయ చేశావో సినిమాలో.. నాగ చైతన్య జీవితంలో పూరీ కూడా సైడ్ క్యారెక్టరేగా.. నిజ జీవితంలోనూ అంతే. పూరీ సినిమాలో మాత్రమే హీరో. పూరీ అసిస్టెంట్ డైరక్టర్ జీవితంలో ఆయనే హీరో.. పూరీ కాదు. ఇలాంటి ఫిలాసఫీలు తప్పించుకోవడానికి వస్తాయి.

అనుభవాల నుంచే అందరూ పాఠాలు నేర్చుకుంటారు !

జీవితంలో ప్రతి ఒక్కరూ అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకుంటారు. నేర్చుకోకపోతే పదే పదే ఫెయిలవుతారు. నేర్చుకున్నప్పుడే సక్సెస్ అవుతారు. అది పూరి కొత్తగా వేదాంతిలో చెప్పకపోయినా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో పూరీ రాక ముందు ఏం జరిగిందో.. ఇప్పుడూ అదే జరుగుతోంది. కాకపోతే అప్పట్లో రూపాయిల్లో జరిగేవి.. ఇప్పుడు కోట్లకు చేరిపోయాయి. అంతే తేడా తప్ప .. పూరీ కాదు. అందుకే పూరీ ఇలాంటి సొల్లు సిద్ధాంతాలు చెప్పి.. సినిమా ఇండస్ట్రీలో పోగొట్టుకున్న నమ్మకాన్ని తెచ్చుకోలేరు. ఆ నమ్మకం ఉండాలంటే.. నిజాయితీ ఉండాలి.

పూరీ డైలాగుల్లో నాకు బాగా నచ్చిన డైలాగ్.. ” వేరే వాళ్లను మోసం చేస్తున్నానని.. నిన్ను నువ్ మోసం చేసుకోమాకు.. సంకనాకి పోతావ్ ” ఇప్పుడు పూరీకి ఈ డైలాగ్ కరెక్ట్‌గా వర్తిస్తుంది. ..అది ఆలోచించుకోవాల్సింది పూరీనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close