లైగర్ ఆలోచన బన్నీ వల్లే వచ్చింది: పూరీ జగన్నాథ్

దర్శకుడు సుకుమార్ లైగర్ ప్రమోషన్స్ లో భాగమయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలు చాలా ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. లైగర్ ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం.., ఇస్తూ.. లైగర్ కథకి కారణం అల్లు అర్జున్ అని చెప్పారు పూరి.

‘ఇద్దరమ్మాయిలతో సినిమా షూటింగ్ లో వున్నపుడు బన్నీ నాతో ఒక మాట చెప్పాడు. ఓ హాలీవుడ్ డైరెక్టర్ తన హీరోలకు ఎదో వైకల్యం పెట్టి మంచి కథలు రాస్తుంటారు. అలాంటి కథ ఒకటి రాయొచ్చుకదా అన్నాడు. దానికి గురించి ఆలోచిస్తుంటే నత్తి ఆలోచన వచ్చింది. నాకు ఎప్పటి నుండో మార్షల్ ఆర్ట్స్ పై సినిమా తీయాలని వుండేది. ఈ రెండిటి మిక్స్ చేసి లైగర్ ని డిజైన్ చేశా” అని చెప్పుకొచ్చారు పూరి.

ఇదే ఇంటర్వ్యూ లో సుకుమార్ ఇచ్చిన సలహాని కూడా పంచుకున్నారు. కథ రాస్తున్నపుడు దానికి కాస్త సమయం ఇవ్వమని చెప్పారట సుకుమార్. ఆయన చెప్పిన సలహాని లైగర్ లో ఫాలో అయ్యారట పూరి. ఇకపై చేసే కథలకు కూడా కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారట పూరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔట్ సోర్సింగ్‌లో పని లేనోళ్లనే తీసేస్తున్నారట !

సీఎం జగన్‌కు కోపం వచ్చిందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే.. పదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ తొలగించాలని ఇచ్చిన ఆదేశాలను చూసి ఆయనకు కోపం వచ్చిందట. అదేంటి.. ఇంత...

పేరు సీమగర్జన – వినిపించింది చంద్రబాబుపై తిట్ల దండకం !

సీమగర్జన పేరుతో వైసీపీ నాయకులు కర్నూలులో చేసిన హడావుడి ప్రహసనంగా మారింది. పరిస్థితి అర్థమయిందేమో కానీ కర్నూలుకు వచ్చి ప్రసంగిస్తానని గట్టి హామీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి హాజరు...

బాల‌య్య హీరోయిన్ దొరికేసిన‌ట్టేనా..?

బాల‌కృష్ణ తో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు పండ‌గే. ఎందుకంటే..ఆయ‌న డైరెక్ట‌ర్ల హీరో. సెట్లో ద‌ర్శ‌కుడు ఏం చెబితే అది చేసేస్తారాయ‌న‌. అందుకే ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో ప‌నిచేయ‌డానికి ఎదురు చూస్తుంటారు. కాక‌పోతే... బాల‌య్య సినిమా...

సాయిధ‌రమ్ టైటిల్‌… ‘విరూపాక్ష‌’?

రిప‌బ్లిక్ త‌ర‌వాత సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా.. సాయి కొన్నాళ్లు సినిమాల‌కు, షూటింగుల‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకొని.. మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడు. వ‌రుస‌గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close