విలువైన ప్రాప‌ర్టీ అమ్మేసిన పూరి?!

సినిమాల్లో సంపాదించింది, మళ్లీ సినిమాకే పెట్ట‌డం అంద‌రికీ సాధ్యం కాదు. మ‌ళ్లీ ఎప్ప‌టికైనా సినిమా వ‌ల్లే సంపాదించుకోవొచ్చ‌న్న న‌మ్మ‌కం ఉంటే త‌ప్ప‌, అంత ధైర్యం చేయ‌లేరు. పూరి ఈ విష‌యంలో గ్రేట్. ‘సినిమా హిట్ట‌యినా సినిమానే తీస్తా, ఫ్లాప్ అయినా సినిమానే తీస్తా. మ‌న‌కు తెలిసింది ఇదొక్క‌టే’ అంటూ ‘నేనింతే’ డైలాగ్ పూరి విష‌యంలో యాప్ట్. హిట్‌, ఫ్లాపులు అత‌న్ని క‌దిలించ‌లేవు. కాక‌పోతే ఆస్తుల్ని క‌రిగిస్తాయింతే.

త‌న సినిమా హిట్ట‌యి డ‌బ్బులొస్తే, దాన్ని ప్రాప‌ర్టీలుగా మార్చ‌డం పూరికి అల‌వాటు. ఫ్లాప్ అయితే ఆ ప్రాప‌ర్టీని అమ్మ‌డం కూడా అంతే రొటీన్ వ్య‌వ‌హారం. ఇటీవ‌ల పూరి నుంచి వ‌చ్చిన‌ ‘డ‌బుల్ ఇస్మార్ట్’ డ‌బుల్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో అప్పులు మ‌రింత పెరిగాయి. వాటిని క్లియ‌ర్ చేయ‌డానికి షంషాబాద్ లోని ఓ విలువైన ప్రాప‌ర్టీని పూరి అమ్మేశాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ‘డ‌బుల్ ఇస్మార్ట్’ విడుద‌లకు ముందు రోజు పూరి ఆఫీసులో పెద్ద పంచాయితీ న‌డిచింది. పాత అప్పులు క్లియ‌ర్ చేయాల్సివ‌చ్చింది. దాంతో షంషాబాద్ ప్రాప‌ర్టీని అప్ప‌టికప్పుడు రూ.18 కోట్ల‌కు అమ్మేయాల్సివ‌చ్చింద‌ని తెలుస్తుంది. ‘డ‌బుల్ ఇస్మార్ట్’ ని నైజాంలో విడుద‌ల చేసిన నిరంజ‌న్ రెడ్డి భారీగా న‌ష్ట‌పోయాడు. ఆ డ‌బ్బుల్ని కూడా పూరి త్వ‌ర‌లోనే రిట‌ర్న్ చేయాల్సివుంది. అందుకోసం కూడా పూరి మ‌రో ప్రాప‌ర్టీ తాక‌ట్టు పెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు … ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న మద్యం...

జ‌న‌సేన‌లోకా… కాంగ్రెస్ గూటికా… బాలినేని దారెటు?

అదిగో రాజీనామా... ఇదిగో రాజీనామా... వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పేస్తారు అంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. వైసీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు, జ‌గ‌న్ పై అసంతృప్తి అన్నీ క‌లిసి......

వైసీపీకి బిగ్ షాక్… బాలినేని రాజీనామా!

ఎన్నో రోజులుగా ఉన్న అసంతృప్తి... జ‌గ‌న్ ఎన్ని రాయ‌బారాలు పంపినా బాలినేని ఆగ‌లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతార‌న్న పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నిక‌లకు ముందు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయండి… హైకోర్టు కీల‌క ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ అనుమ‌తి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close