టాలీవుడ్‌ హీరోల గురించి ఎవరికీ తెలియని నిజాలు చెప్పిన పూరీ

తారక్ కారు నడిపే స్పీడ్ మామూలుగా ఉండదు
-బన్నీకి మైనస్ టెంపరేచర్‌లోనూ బాడీపైనే ధ్యాసే
– రక్షిత, రవితేజ బూతులు తిట్టుకునేవారు
– కథ మారుస్తావో లేదో అని చెక్ చేసిన పవన్
– ప్రభాస్ తిండిపెట్టి చంపేస్తాడు
– బాలయ్య పరమభక్తుడు

పూరీ జగన్నాథ్.. టాలీవుడ్‌కు గతంలో వరుసగా హిట్స్ ఇచ్చిన దర్శకుడు. కుర్రకారు మొత్తం ఇష్టపడే డైరెక్టర్ ఆయన. కొన్ని ఏళ్లుగా వరుస ప్లాప్స్‌తో ఇబ్బందిపడుతున్నా ఆయనకు యూత్‌లో ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇప్పటికీ పూరీ సినిమా అంటే చొక్కాలు చింపుకునే యువత చాలామందే ఉన్నారు. ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరీకి తాజాగా రామ్‌తో చేసిన ఇస్మార్ట్ శంకర్ మంచి కిక్‌ను ఇచ్చింది. మళ్లీ పూరీ హిట్‌లిస్ట్‌లోకి వెళ్లేలా చేసింది ఈ మూవీ. సినిమా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పూరీ.

ఇక సినిమా గురించి, తాను పని చేసిన హీరోలతో తనకుండే సంబంధాల గురించి పూరీ జగన్నాథ్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొందరు హీరోల ప్రవర్తనకు సంబంధించిన సంచలన విషయాలను బయట పెట్టారు. టాలీవుడ్‌ హీరోల గురించి ఎవరికీ తెలియని నిజాలు చెప్పారు. పూరీ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించడానికి విజయదేవరకొండను సంప్రదించారనే విషయంలో వాస్తవం లేదన్నారు. రామ్‌ను కలిసినప్పుడు తన దగ్గర కథ కూడా లేదని, ఒక బ్యాడ్‌బ్యాయ్ కథ రెడీ చేయమని రామ్ చెప్పడంతో అలాంటి కథ సిద్ధం చేశానన్నారు. గత మూడేళ్లుగా తాను తీసిన సినిమాలు ఏవీ సరిగ్గా ఆడకపోవడంతో ఏదో కొట్టాలనే తాపత్రయంతో ఈ సినిమా తీశానన్నారు. హీరోగా రామ్ వాడుకున్నడోకి వాడుకున్నంత టైప్, ఆయనలో చాలా ట్యాలెంట్ ఉంది వెరీ గుడ్ యాక్టర్, డ్యాన్సర్, ఎనర్జీ లెవల్స్ బాగుంటాయన్నారు పూరీ.

మ్యూజిక్ డైరెక్టర్ మణిశంకర్‌తో కలిసి నేను చేసిన సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయన్నారు. చాలా గ్యాప్ తర్వాత మేమిద్దరం మళ్లీ పని చేశామని మణి తనకు ఇచ్చిన హిట్స్ గుర్తు తెచ్చుకున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ ఎంతో మంది హీరోలతో పని చేశారు. అందులో కొందరు హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను పూరీ గుర్తు చేశారు. ఆ మెమోరీస్ పూరీ మాటల్లోనే..

‘‘టెంపర్ మూవీ షూటింగ్‌ ఎక్కువగా గోవాలో జరిగింది. తారక్‌తో కలిసి క్యారెక్టర్ ఎంజాయ్ చేసేవాణ్ని. ఈవెనింగ్ షూటింగ్ అయిపోగానే తారక్ కారు ఎక్కించుకుని అలా బయటకు తీసుకెళ్లేవారు. ఆ స్పీడ్ మామూలుగా ఉండేది కాదు.. వందకు పైగా స్పీడ్‌తో దూసుకెళ్లేవారు. తారక్ ఆ విషయంలో ఎవరూ చెప్పినా వినరు.’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌తో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు.

‘‘ దేశముదురు షూటింగ్ 40 రోజుల పాటు కులుమునాలిలో జరిగింది. షూటింగ్ అయిపోయాక టీమ్ మొత్తం తింటూ ఎంజాయ్ చేస్తుంటే.. బన్నీ మాత్రం ఎక్సర్ సైజ్ చేసేవారు. మేము అందరం చలికి తట్టుకోలేక బెడ్ షీట్స్ ఫుల్‌గా కప్పుకునేవాళ్లం. కానీ బన్నీ మాత్రం మైనస్ టెంపరేచర్‌లో షర్ట్ లేకుండా డిప్స్ తీసేవాడు.’’ అంటూ అల్లు అర్జున్‌తో జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నాడు పూరీ.

‘‘ రవితేజ ఇడియట్ మూవీ షూటింగ్‌లో గోలగోల చేసేవాడు. రక్షిత, రవితేజ బూతులు తిట్టుకుంటూ కొట్టుకునేవారు. అలా వారు కొట్టుకునే సమయంలో నేను రొమాంటిక్ సాంగ్ తీయాల్సి వచ్చేది. కానీ సాంగ్‌లో మాత్రం ఫుల్ రొమాంటిక్‌గా బాగా యాక్ట్ చేశారు’’ అంటూ రవితేజతో జరిగిన సంఘటనను చెప్పారు పూరీ.

‘‘ బద్రి కథ పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు.. నాకు కథ బాగా నచ్చింది కానీ క్లైమాక్స్ నచ్చలేదన్నారు. క్లైమాక్స్‌లో ఫైట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో అనుకున్నా. తర్వాత కథ మార్చి రాశాను. కానీ నాకే నచ్చలేదు. సరే అని మళ్లీ వెళ్లి పవన్ కళ్యాణ్‌కు కథ చెప్పాను. ఇది ఇంతకు ముందు క్లైమాక్సే కదా అన్నారు. మీరు ఇంతకు ముందు సరిగ్గా విన్నారో లేదో అని మళ్లీ చెబుతున్నాను అన్నాను. నాకు కూడా ఈ క్లైమాక్సే నచ్చింది. నేను అడిగితే నువ్వు మారుస్తావో లేదో అని చెక్ చేశానన్నారు. ఆ టైమ్‌లో నేను క్లైమాక్స్ మార్చి ఉంటే నా క్యారెక్టర్ దెబ్బతినేది’’ అంటూ పవన్ కళ్యాణ్‌తో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకున్నారు పూరీ.

‘‘చిరుత షూటింగ్‌‌లో భాగంగా మొదట బ్యాంకాక్‌లో రామ్ చరణ్‌తో సాంగ్ ప్లాన్ చేశా. ఐల్యాండ్‌లో షూటింగ్ చేస్తుంటే ఆ వేడికి చరణ్ చర్మం మొత్తం నల్లగా మారిపోయింది. ఇక కొన్ని రోజులు షూటింగ్ అలాగే కంటిన్యూ చేసి ఉంటే చర్మంపై ఉన్న లేయర్ మొత్తం పోయి నల్లగా మారిపోయేవాడు.’’ అంటూ చరణ్ జరిగిన సంఘటనల్ని వివరించారు పూరీ.

‘‘బుజ్జిగాడు స్క్రిప్ట్ బ్యాంకాక్‌లో రాస్తూ కూర్చొన్నా. ప్రభాస్ ఒక రోజు ఉదయాన్నే అక్కడికి వచ్చాడు. ఒక ముగ్గురు కుర్రాలతో రకరకాల వంటకాలను తీసుకొచ్చాడు ప్రభాస్. నాలుగు రోజులు పాటు అక్కడే ఉన్నాడు. రోజూ రకరకాల వంటకాలు చేయించి తినిపించేవాడు. ఇక తారక్ అయితే ఏకంగా తానే వండిపెట్టి తినిపించేవాడు’ అంటూ గుర్తు చేసుకున్నాడు పూరీ.

‘‘బాలయ్య బాబు నాకు ఎంతో అభిమానం. ఐ లవ్ బాలయ్య. ఆయనతో కూర్చొని మాట్లాడడం, ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు దైవభక్తి ఎక్కువ. పైసావసూల్ షూటింగ్ సమయంలో తెల్లవారుజామునే నాలుగున్నరకే యూనిట్ మొత్తాన్ని నిద్ర లేపేవారు. బాలయ్య చాలా గ్రేట్ మన్’’ అంటూ తనకు బాలయ్యతో ఉన్న బంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు పూరీ.

ఇక మెగాస్టార్ చిరంజీవితో నాలుగుసార్లు సినిమా తీయాలనుకున్నాను.. రెండుసార్లు మూవీలకు సంబంధించి పూజలు కూడా పూర్తయ్యాయని ఆయతో సినిమా తీయాలని ఉందని పూరీ చెప్పారు. ఇలా పూరీ తాను పని చేసిన హీరోలతో ఉన్న బంధాలను గుర్తు చేస్తుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి... బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత... పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే...

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

HOT NEWS

[X] Close
[X] Close