ప్రః హాయ్ సర్…ఇజం ఫైనల్ ప్రొడక్ట్ చూశాక మీ ఫీలింగ్స్ ఏంటి?
పూరీః ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్. ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది
ప్రః ఇజంలో ఏం చెప్పబోతున్నారు?
పూరీః అవినీతి గురించి చెప్తాం…
ప్రః అప్పుడెప్పుడో వచ్చిన శంకర్ సినిమాల నుంచి మీరు తీసిన కెమేరా మేన్ గంగతో రాంబాబు వరకూ ఆల్రెడీ చాలా చెప్పేశారుగా….
పూరీః అవినీతి గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఇంకా చాలా చాలా కథలు రాయొచ్చు. అంతెందుకు ఇప్పుడు మేం ఇజంలో చెప్తున్నటువంటి కరప్షన్ గురించి ఇంత వరకూ ప్రపంచంలోనే వేరే సినిమా ఏదీ రాలేదు. అవినీతి ఎన్నెన్ని కొత్త కొత్త రూపాలు తీసుకుంటూ ఉందో చూస్తూనే ఉన్నాంగా. అవినీతిపరులు కూడా టెక్నికల్‌గా చాలా డెవలప్ అయ్యారు. లేటెస్ట్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ కొత్త కొత్త అవినీతి మార్గాలను కనిపెడుతున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని అలాంటి ఓ కొత్త రకం అవినీతి గురించే ఇజం సినిమాలో చెప్పాం.
ప్రః అంటే కెమేరా మేన్ గంగతో రాంబాబులా క్లాస్‌లు పీకడం, మెస్సేజ్‌లు చెప్పడం ఉంటుందా?
పూరీః ఆ సినిమాకు ఈ సినిమాకు అస్సలు సంబంధమే ఉండదు. ఇజంలో మేం ఎవరికీ క్లాసులు పీకం. మెస్సేజ్‌లు చెప్పం. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ తన జీవితంలో ఫేస్ చేసిన స్ట్రగుల్స్‌ని చూపిస్తాం. అందులోనే అంతా ఉంటుంది.
ప్రః ఇజం కోసం కళ్యాణ్ రామ్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
పూరీః నిజ జీవితంలో కూడా కళ్యాణ్ రామ్ చాలా నిజాయితీగా ఉంటాడు. నిజాయితీపరుడైన ఓ జర్నలిస్ట్ క్యారెక్టర్‌కి ఆయన న్యాయం చేయగలడనిపించింది.
ప్రః సిక్స్ ప్యాక్ ఐడియా మీ పర్సనల్ ఇంట్రెస్టా? లేక కథకు అవసరమా?
పూరీః ఈ కథకు అవసరమే. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే హీరో, నిజాయితీపరుడైన జర్నలిస్ట్ అంటే భారీ పొట్టవేసుకుని ఉండకూడదు కదా? మానసికంగా, శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండాలి. కళ్యాణ్ రామ్‌తో కూడా అదే చెప్పాను. ఆయన చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించాడు.
ప్రః కళ్యాణ్ రామ్ యాక్టింగ్ శైలిని కూడా మార్చినట్టున్నారు
పూరీః నేను మార్చడం కాదు. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాలి అని చెప్పాను. ఫిజికల్‌గా చాలా కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించడమే కాదు యాక్టింగ్ పరంగా కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడే యాక్టర్ తను. అందుకోసం ఫుడ్ హ్యాబిట్స్, లుక్స్ అండ్ యాక్టింగ్ శైలిని కూడా ఎంతైనా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. వంద శాతం కష్టపడతాడు. అది కూడా నిజాయితీగా కష్టపడతాడు. ముందే చెప్తున్నానని కాదుగానీ ఇజంలో కళ్యాణ్ రామ్ యాక్టింగ్‌కి రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకోవడం ఖాయం. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో అయితే అదిరిపోయే రేంజ్లో యాక్ట్ చేశాడు.
ప్రః హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి? పెర్ఫార్మెన్స్ ఎలా చేసింది?
పూరీః సూపర్బ్. మిస్ ఇండియాగా సెలక్ట్ అయిన అమ్మాయి కాబట్టి లుక్స్ గురించి చెప్పనవసరం లేదు. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. జావేద్ భాయ్ అనే డాన్ కూతురు క్యారెక్టర్ చేసింది.
ప్రః ఇజంలో డైరెక్షన్‌తో పాటు ఇంకా చాలా చేసినట్టున్నారు
పూరీః హ..హ…హా…అది నా ఐడియా కాదు. అనూప్ది. తనే నా చేత పాట రాయించాడు. అండ్ ఆ పాట నేను పాడితేనే బాగుంటుందని చెప్పి పాడించాడు.
ప్రః మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు ఉంటుంది?
పూరీః ఆయనకు కథ చెప్పాను. కథ నచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత నుంచి కాల్ రాలేదు. అందుకే నా పని నేను చేసుకుంటున్నాను. ఆయన ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను కూడా రెడీ.
ప్రః ఆ మధ్య కాలంలో ఓ సారి అభిషేక్‌తో సినిమా చేస్తానని చెప్పినట్టున్నారు
పూరీః అవును అభిషేక్‌తో సినిమా చెయ్యాలి. ఆయనకు టెంపర్ సినిమా చూపించాను. నచ్చిందన్నాడు. అయితే ఎన్టీఆర్ స్థాయిలో నేను యాక్ట్ చేయలేనని చెప్పాడు. అందుకే టెంపర్ రీమేక్ ఐడియా డ్రాప్ చేశాం.
ప్రః కథలు రాయడం …
పూరీః నెక్ట్స్ పదేళ్ళ వరకూ కూడా నా దగ్గర కథలు ఉన్నాయి. చాలా కథలు రాసుకుంటూ ఉంటాను. వాటిలో కొన్ని కొందరికి నచ్చుతూ ఉంటాయి. కొందరికి నచ్చవు. పోకిరి సినిమా కథను పవన్ కళ్యాణ్‌కి చెప్పాను. ఆయనకు నచ్చలేదు. మహేష్‌కి నచ్చింది. అలాగే ఇంకా కొన్ని కథలు కూడా కొంతమంది హీరోలకు నచ్చలేదు. నా కథను ఇష్టపడ్డ హీరోలతోనే సినిమాలు చేస్తున్నా.
ప్రః ఇజం సినిమా కథ కూడా వేరే హీరోలకు చెప్పారా?
పూరీః ఇజం కథను నేను పదేళ్ళ క్రితం రాసుకున్నా. మధ్యలో కొంత మంది హీరోలకు చెప్పా. వాళ్ళకు నచ్చలేదు. అయితే వాళ్ళకు చెప్పిన కథకు ఇఫ్పుడు తెరకెక్కిన కథకు చాలా తేడా ఉంది. నా కథలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా, అలాగే బెటర్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాను. అలా ఇజం కథను కూడా కొత్తగా చాలా మార్చా. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది.
తెలుగు360ః ఒకె సార్……ఆల్ ద బెస్ట్….మీరు కొత్తగా చూపిస్తున్న కరప్షన్…అలాగే సొల్యూషన్స్ కూడా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాం…..
పూరీః అవును…నా ఆలోచనలకు తగ్గట్టుగా సొల్యూషన్ కూడా చెప్పాను.
తెలుగు360ః ఆల్ ద బెస్ట్ పూరీ గారూ…..
పూరీః థ్యాంక్యూ.