పూరి క‌థ : ఇండియా Vs పాకిస్థాన్‌

పైసా వ‌సూల్ మూడ్ నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్న పూరి జ‌గ‌న్నాథ్‌… ఇప్పుడు త‌న త‌న‌యుడు సినిమాపై ఫోక‌స్ పెట్టాడు. పూరి ఆకాష్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ఓ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. పూరి అంటేనే మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు. అయితే.. పూరి ఆకాష్ ఇంకా చిన్నోడే కాబ‌ట్టి, త‌న‌కి త‌గిన స్టోరీ ఒక‌టి సెట్ చేశాడ‌ట‌. ఈసారి ల‌వ్ స్టోరీతో అల‌రించ‌డానికి సిద్ధం అవుతున్నాడు పూరి. ఈ క‌థ ఇండియా, పాకిస్థాన్ బోర్డ‌ర్‌లో సాగే క‌థ అని తెలుస్తోంది. ఇండియా అబ్బాయికీ, పాకిస్థాన్ అమ్మాయికీ జ‌రిగే ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంద‌ట‌. ”ల‌వ్ స్టోరీ చేసి చాలాకాల‌మైంది. మా అబ్బాయి కోసం ఓ ప్రేమ‌క‌థ సిద్దం చేశా. అదో డిఫ‌రెంట్ పాయింట్‌.. నిజాయ‌తీ ఉన్న ప్రేమ‌క‌థ‌” అని హింట్ ఇచ్చేశాడు పూరి. నిజానికి పూరి ద‌గ్గ‌ర మూడు క‌థ‌లున్నాయిప్పుడు. అందులో ఒక‌టి సెట్ చేయాలి. ఇండియా, పాక్ క‌థకే పూరి ఎక్కువ మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పూరి క‌థానాయిక‌ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాడు. ఆ బాధ్య‌త ఛార్మికి అప్ప‌గించాడ‌ట‌. పూరి కనెక్ట్స్ ద్వారా ఛార్మి కొంత‌మంది అమ్మాయిల్ని ఆడిష‌న్ చేసింది. ఆకాష్‌తో కొంత‌మందికి ఫొటో సెష‌న్స్ కూడా నిర్వ‌హించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థానాయిక వ్య‌వ‌హారం ఓ కొలిక్కి రాలేద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com