మ‌హేష్ నుంచి పూరికి కౌంట‌ర్ రానుందా?

`హిట్టున్న ద‌ర్శ‌కుల‌తోనే మ‌హేష్ సినిమాలు తీస్తాడు` అంటూ… మ‌హేష్ బాబుపై ఓ పంచ్ విసిరాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఇదే ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండ్ర‌స్ట్రీ అయ్యింది. మ‌హేష్ ఇప్పుడు త‌న‌తో సినిమా చేస్తాన‌న్నా తాను మ‌హేష్‌తో ప‌నిచేయ‌డానికి సిద్ధంగా లేన‌ని తేల్చేశాడు పూరి. మ‌హేష్ విష‌యంలో పూరి ఎంత హ‌ర్ట్ అయ్యాడో.. ఈ స్టేట్‌మెంట్‌ని చూస్తే తెలిసిపోతుంది. నిజానికి పోకిరి, బిజినెస్ మెన్‌ల‌కు ముందు పూరి సినిమాలు ఫ్లాపులే. కానీ.. మహేష్ పిలిచి మ‌రీ ఛాన్సిచ్చాడు. కానీ పూరి ఇలా ఎందుక‌న్నాడ‌న్న‌దే… మ‌హేష్ ఫ్యాన్స్‌కి సైతం అర్థం కావ‌డం లేదు.

పూరి స్టేట్మెంట్ మ‌హేష్‌బాబు వ‌ర‌కూ వెళ్లే ఉంటుంది. సోష‌ల్ మీడియాని చురుగ్గా ఫాలో అవుతుంటాడు మ‌హేష్‌. పూరి మాట‌లు మ‌హేష్‌ని చేరే ఉంటాయి. దీనిపై మ‌హేష్ కూడా కౌంట‌ర్ ఇచ్చేయ‌డానికి ప్లాన్ చేస్తుంటాడు. ఎందుకంటే… మ‌హేష్ ఈమ‌ధ్య ఏదీ త‌న మ‌న‌సులో దాచుకోవ‌డం లేదు. వెంట‌నే బ‌య‌ట‌ప‌డిపోతున్నాడు. ఇటీవ‌ల సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ అయిన విష‌యం, వెంట‌నే మ‌హేష్‌ `మ‌హ‌ర్షి` వేడుక‌లో… సుకుమార్‌పై ప‌రోక్షంగా సెటైర్ వేయ‌డం గుర్తుండే ఉంటాయి. ఈసారీ పూరిని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ మ‌హేష్ స్పందించే అవ‌కాశాలే ఉన్నాయ‌ని, ఈ విష‌యాన్ని మ‌హేష్ సీరియ‌స్‌గానే తీసుకుంటాడ‌ని మ‌హేష్ కాంపౌండ్ వ‌ర్గాలు, స‌న్నిహితులు చెబుతున్నారు. మ‌రి పూరి పంచ్‌కి మ‌హేష్ స‌మాధానం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close