పూరికి హీరో… ర‌వితేజ‌కు విల‌న్‌

పూరి సినిమా.. ‘రోగ్‌’తో తెలుగులో హీరోగా ప‌రిచయ‌మ‌య్యాడు ఇషాన్‌. మంచి హైటు, ప‌ర్స‌నాలిటీ ఉన్న ఇషాన్ న‌టుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నా, ఆ సినిమా ఫ్లాప్ అయ్యేస‌రికి ఇక క‌నిపించ‌లేదు. ఇప్పుడు చాలాకాలం త‌ర‌వాత మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తున్నాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ‘మ‌హా స‌ముద్రం’ అనే సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తారు. వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్ నిర్మాత‌. ఈ సినిమాలో ఇషాన్‌కి ఓ మంచి పాత్ర ద‌క్కింద‌ని తెలుస్తోంది. ఇందులో ఇషాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. విల‌న్ పాత్ర‌ల‌కు ఇషాన్ బాగానే ఉంటాడు. ఈమ‌ధ్య హీరోలంతా.. యంగ్ విల‌న్ల‌పై దృష్టిసారించారు. ఆది పినిశెట్టి లాంటి వాళ్ల‌కు మంచి ఆఫ‌ర్లు ద‌క్కుతున్నాయి. అందులో భాగంగా ఇషాన్ ని కూడా విల‌న్‌గా రంగ ప్ర‌వేశం చేయించ‌బోతున్నార‌న్న‌మాట‌. ర‌వితేజ ప్ర‌స్తుతం ‘డిస్కోరాజా’తో బిజీగా ఉన్నాడు. మ‌రి ‘మ‌హా స‌ముద్రం’ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close