బ‌న్నీ గ‌డ్డం@ రూ.40 ల‌క్ష‌లు

అల్లు అర్జున్ ‘గ‌డ్డం’ కూడా టాక్ ఆఫ్ ది టాలీవుడ్డే. ఆయ‌న ‘పుష్ష 2’ షూటింగ్ మ‌ధ్య‌లో ఉండ‌గానే గ‌డ్డం ట్రిమ్ చేసేయ్య‌డం సినీ వ‌ర్గాల్ని, అభిమానుల్ని ఆశ్చ‌ర్యంలో ప‌డేసింది. స‌డ‌న్ గా ‘పుష్ష’ లుక్ లోంచి బ‌య‌ట‌కు రావ‌డంతో కొత్త అనుమానాలు త‌లెత్తాయి. ‘షూటింగ్ కు బ్రేకులు ప‌డ్డాయి. కాబ‌ట్టి… బ‌న్నీ గ‌డ్డం తీసేశారు. మ‌ళ్లీ షూటింగ్ మొద‌ల‌య్యేస‌రికి గ‌డ్డం పెరిగిపోతుంది’ అంటూ… బ‌న్నీ కాంపౌండ్ వ‌ర్గాలు ఈ విష‌యాన్ని తేలిగ్గా తీసుకొన్నాయి.

అయితే… నెల రోజుల గ్యాప్ కాస్త త‌గ్గిపోయి, అనుకొన్న‌దానికంటే ముందుగానే ‘పుష్ష 2’ షూటింగ్ మొద‌లైపోయింది. కావ‌ల్సిన‌ప్పుడ‌ల్లా పెరిగిపోవ‌డానికి అది బీపీ కాదు క‌దా, గడ్డం. కాబ‌ట్టి.. తీసేసిన గెడ్డంతో కంటిన్యుటీ స‌మ‌స్య వ‌చ్చింది. సినిమా వాళ్ల‌కు పెట్టుడు గ‌డ్డాలు, మీసాలూ, విగ్గులూ అల‌వాటే. కాక‌పోతే… అవి ఎప్పుడూ ఆర్టిఫిషియ‌ల్ గానే ఉంటాయి. నేచుర‌ల్ లుక్ రావ‌డానికి ‘పుష్ష’ టీమ్ చాలా క‌ష్ట‌ప‌డింద‌ట‌. ముంబై నుంచి ఓ నిపుణుడ్ని పిలిపించి, బ‌న్నీకి పెట్టుడు గడ్డం సెట్ చేయించార్ట‌. దాని ఖ‌రీదు అక్ష‌రాలా రూ.40 ల‌క్ష‌లు అని తెలుస్తోంది. ఈ గెడ్డం టెంప‌ర‌రీనే. మేక‌ప్ తీసి, మ‌ళ్లీ వేసిన‌ప్పుడ‌ల్లా పెట్టుడు గడ్డంతో క‌వ‌ర్ చేయాలి. అందుకోస‌మే ఇంత ఖ‌ర్చ‌ని తెలుస్తోంది. ‘మారుతి న‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు బ‌న్నీ వ‌చ్చాడు. `పుష్ష` రేంజ్‌లో గడ్డం లేదు. ‘ఈ గడ్డంతోనే క్లైమాక్స్ షూట్ చేస్తున్నారా’ అంటూ అభిమానులూ ముక్కున వేలేసుకొన్నారు. దాని వెనుక క‌థ ఇది.

ఆగ‌స్టు 15న రావాల్సిన సినిమా ఇది. అనుకొన్న స‌మ‌యానికి పుష్ష వ‌చ్చేస్తే… జాత‌కం ఈపాటికే తెలిసిపోయేది. కానీ ఇప్పుడు డిసెంబ‌రు 6 వ‌ర‌కూ ఆగాలి. అప్పుడైనా ఈ సినిమా వ‌స్తుందా, రాదా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ‘మారుతి న‌గ‌ర్‌’ ఫంక్ష‌న్లో డిసెంబ‌రు 6కే ఈ సినిమా వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

అడియోస్ అమిగో రివ్యూ: అపరిచితుల జీవయాత్ర

సినిమా అనగానే ఇంట్రడక్షన్, పాటలు, ఫైట్లు, స్క్రీన్ ప్లే లో త్రీ యాక్ట్.. ఇలా కొన్ని లక్షణాలు ఫిక్స్ అయిపోతాయి. కానీ అప్పుడప్పుడు ఆ రూల్స్ ని పక్కన పెట్టి కొన్ని చిత్రాలు...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం- ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన టీడీపీ

తిరుమ‌ల వెంక‌న్న ల‌డ్డూ ప్ర‌సాదం అంటే ఎంతో సెంటిమెంట్. క‌ళ్ల‌కు అద్దుకొని తీసుకుంటారు. వెంక‌న్న‌ను ద‌ర్శించుకున్నంతగా భావిస్తారు. కానీ ఆ ల‌డ్డూ త‌యారీలో వాడిన నెయ్యిని గొడ్డు మాసం కొవ్వుతో త‌యారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close