బ‌న్నీ బ‌ర్త్ డే గిఫ్ట్‌: మ‌హిశాసుర మ‌ర్థిని అవ‌తారంలో పుష్ష‌రాజ్‌

బ‌న్నీ అభిమానులు ఆశ‌గా, ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ష 2’ టీజ‌ర్ వ‌చ్చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా పుష్ష 2 టీజ‌ర్ వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ముందే చెప్పింది. అనుకొన్న‌ట్టుగానే ఈ రోజు 11 గంట‌ల 7 నిమిషాల‌కు టీజ‌ర్ విడుద‌ల చేశారు. ‘పుష్ష 2’లోని గంగ‌మ్మ జాత‌ర ఎపిసోడ్‌ని హైలెట్ చేస్తూ, ఈ టీజ‌ర్ ఉంటుంద‌ని తెలుగు 360 ముందే చెప్పింది. స‌రిగ్గా అదే జ‌రిగింది. నిమిషం నిడివి గ‌ల ఈ టీజ‌ర్‌లో గంగ‌మ్మ జాత‌ర‌లో పుష్ష గెట‌ప్‌ని రివీల్ చేశారు. మ‌హిశాసుర మ‌ర్థిని అవ‌తారంలో శ‌త్రు సంహారం చేస్తున్న పుష్ష‌ని చూపించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, స‌రికొత్త అవ‌తారంలో ఎంట్రీ ఇచ్చిన బ‌న్నీ, యాక్ష‌న్ మోడ్‌… అభిమానుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తోంది. ‘పుష్ష 2’లో గంగ‌మ్మ జాత‌ర ఎపిసోడ్ చాలా కీల‌కం. ఇంట్ర‌వెల్ ముందొచ్చే ఈ ఎపిసోడ్ కోసం చిత్ర‌బృందం దాదాపు రూ.50 కోట్లు వెచ్చించింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉండ‌బోతోందో మ‌చ్చుక్కి టీజ‌ర్‌లో చూపించాడు సుకుమార్‌. టీజ‌ర్ ఇంపాక్ట్‌బుల్ గానే ఉన్న‌ప్ప‌టికీ.. బ‌న్నీ నుంచి డైలాగ్ ఏం రాక‌పోవ‌డం పెద్ద లోటుగా క‌నిపిస్తోంది. ‘పుష్ష‌’లో డైలాగులు ఆక‌ట్టుకొన్నాయి. వ‌న్ లైనర్లు అదిరిపోయాయి. అయితే అలాంటి సింగిల్ డైలాగ్ కూడా లేకుండా, కేవ‌లం యాక్ష‌న్ మోడ్‌లోనే మొద‌లెట్టి, ముగించ‌డం అభిమానుల‌కు కాస్త నిరాశ క‌లిగించింది.

ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్‌పై చిత్ర‌సీమ‌లో కొన్ని సందేహాలున్నాయి. అయితే.. మ‌రోసారి నిర్మాతలు ఆగ‌స్టు 15నే వ‌స్తున్నామ‌ని టీజ‌ర్‌లోనూ బ‌లంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఆగ‌స్టు 15నే ఈ సినిమా రానుంది. అందులో ఎలాంటి అనుమానాలూ అవ‌స‌రం లేదు. దానికి త‌గ్గ‌ట్టే వ‌ర్క్ కూడా జెట్ స్పీడ్ లో సాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.