పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పుష్ప‌కి సంబంధించిన వ‌ర్క్ ఇంకా పెండింగ్‌లో ఉంద‌ని, ఈ ద‌శ‌లో రిలీజ్ కావ‌డం అంత తేలిక కాద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. అయితే… రిలీజ్ డేట్ విష‌యంలో త‌గ్గేదే లే అంటోంది పుష్ప టీమ్‌. తాజాగా ఓ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ట్రైల‌ర్ ఎప్పుడొచ్చేది.. సోమ‌వారం చెబుతామ‌ని ప్ర‌క‌టించింది. ఆ పోస్ట‌ర్‌లో డిసెంబ‌రు 17న రిలీజ్ కాబోతోంద‌ని మ‌ళ్లీ గ‌ట్టిగా పునః ప్ర‌క‌ట‌న చేసింది.

ఈ సినిమాని అనుకున్న స‌మ‌యానికి విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం అంతా అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతోంది. ఓ వైపు చెన్నైలో రీ రికార్గింగ్ జ‌రుగుతోంది. ఎడిటింగ్ వ‌ర్క్ కొన‌సాగుతోంది. బ‌న్నీ కూడా `ఎట్టి ప‌రిస్థితుల్లోనూ డిసెంబ‌రు 17నే ఈ సినిమా రావాలి` అని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. అందుకే టీమ్ అంతా రాత్రింబ‌వ‌ళ్లూ శ్ర‌మిస్తోంది. ట్రైల‌ర్ ని కూడా పూర్తి చేసి వ‌దులుతున్నారంటే.. డిసెంబ‌రు 17న రావ‌డం ప‌క్కా అన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ కానిస్టేబుల్ హత్య ఏపీ పోలీసు వ్యవస్థ బలహీనతకు సాక్ష్యం !

నంద్యాలలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను రౌడిషీటర్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. విధి నిర్వహణలో కటువుగా ఉండే హెడ్ కానిస్టేబుల్ రోడ్‌పై ఒంటరిగా కనిపిస్తే ఆరుగురు...

ఫ‌స్టాఫ్ లాక్ చేసిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3తో.. త‌న విజ‌య యాత్ర‌ని దిగ్విజ‌యంగా కొన‌సాగించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా బాల‌కృష్ణ సినిమాపైనే ఉంది. అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం...

కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు....

మీడియా వాచ్ : కులాల మధ్య చిచ్చుపెట్టి చానళ్లు ఎంత సంపాదించుకుంటాయి ?

రాజకీయ మీడియా వలువలు వదిలేసింది. విలువ కట్టుకుని.. వసూలు చేసుకుని నగ్నంగా ఊరేగుతోంది. కులాల పేర్లు పెట్టి ఆ రెండు కులాలు కొట్లాడుకుంటున్నాయని ప్రచారం చేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close