ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని ఎలాగైనా విడగొట్టాలనే దురుద్దేశంతోనే కొందరు ఈ కుట్రలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నతమైన వ్యక్తి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం, అవమానించడం ఎంతమాత్రం సరికాదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే విరుద్ధమని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్‌పై ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక ఘోరమైన రాజకీయ వ్యూహం దాగి ఉందంటూ బీజేపీ శ్రేణులు ఇప్పుడు అంటున్నాయి. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు పవన్ కల్యాణ్‌ను ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని వారు విమర్శిస్తున్నారు. అయితే, తెలంగాణలో పవన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనల వెనుక ఉన్న నాయకులు, నాగేశ్వర్ గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రవర్తించినప్పుడే స్పందించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాగేశ్వర్ లాంటి వారు అమిత్ షా వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని తక్కువ చేస్తూ పిట్టకథలు అల్లినప్పుడు మాట్లాడినప్పుడు ఇక్కడి నాయకులు లేదా విమర్శకులు కనీసం నోరు మెదపలేదని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అమిత్ షా విషయంలో మాట్లాడకుండా, ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను తిడుతూ కొందరు నేతలు విచిత్రమైన రీతిలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.బీజేపీ నేతలు మౌనంగా ఉండటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అయినా వారు మాత్రం.. తమ రాజకీయాలు తాము చేసుకుంటున్నారు.
