మ‌హేష్ తో సినిమా.. అంతా ఉత్తిదేన‌ట‌

బ్ర‌హ్మోత్స‌వం దెబ్బ‌కు బ‌య్య‌ర్లు బెంబేలెత్తిపోయారు. స‌గం డ‌బ్బులు కూడా తిరిగి రావ‌డం క‌ష్ట‌మ‌ని తేలిపోయింది. ఇప్పుడు వాళ్ల‌ని ఆదుకొనే బాధ్య‌త పీవీపీపై ప‌డింది. ‘మేం ఆదుకొంటాం’ అని పీపీపీ, మహేష్ నేరుగా చెప్ప‌క‌పోయినా, అందుకు త‌గిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌న్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. బ్ర‌హ్మోత్స‌వం బాధితుల్ని ఆదుకోవ‌డానికి పీవీపీ ఇప్పుడు మ‌రో సినిమాని టేక‌ప్ చేయ‌బోతోంద‌ని, ఈసారీ మ‌హేష్‌తోనే ఆ సినిమా ఉంటుంద‌ని, ద‌ర్శ‌కుడిగా వంశీపైడిప‌ల్లిని ఎంచుకొన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వీటిపై పీవీపీ ప్ర‌తినిధి బృందం స్పందించింది. తెలుగు 360 తో పీవీపీ ప్ర‌తినిధి ఒక‌రు మాట్లాడారు కూడా.

”మహేష్‌తో ఓ సినిమా చేస్తున్నామ‌న్న విష‌యంలో ఎలాంటి వాస్త‌వం లేదు. అదంతా గాసిప్పే. వంశీపైడిప‌ల్లితో ఓ సినిమా చేద్దామ‌నుకొన్నాం. అయితే హీరో ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. మ‌హేష్ తో మాత్రం కాదు..” అని క్లారిటీ ఇచ్చేసింది. బ్ర‌హ్మోత్స‌వం ప్ర‌భావం నుంచి పీవీపీ బ‌య‌ట‌ప‌డ‌డానికి ఇంకా టైమ్ ప‌ట్టేట్టుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో సినిమా గురించి ఆలోచించే ధైర్యం చేయ‌ట్లేదు పీవీపీ. మ‌రి బ‌య్య‌ర్ల న‌ష్టాల్ని ఎలా తీరుస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close