భవిష్యత్ కంప్యూటింగ్ అవకాశాలను వెదుక్కునే క్రమంలో అమరావతిని దానికి కేంద్రంగా చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని నిరణియంచింది. ఈ కేంద్రం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడనుంది ఐబీఎంకు భిన్నమైన సాంకేతికతతో క్వాంటం కంప్యూటర్ను అభివృద్ధి చేయనుంది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
మైక్రోసాఫ్ట్ పరిశోధన కేంద్రం స్థాపనతో అమరావతిలో ఐటీ రంగంలో వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, క్వాంటం కంప్యూటింగ్ నిపుణులకు కేంద్రంగా మారుతుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌తో క్వాంటం సిస్టం-2ని ఏర్పాటు చేస్తోంది, ఇది భారతదేశంలో అతిపెద్ద క్వాంటం కంప్యూటర్‌గా ఉంటుంది. క్వాంటం కంప్యూటింగ్ సేవలు, హైబ్రిడ్ కంప్యూటింగ్ వ్యూహాలు, వైద్యం, ఆర్థిక, ఉత్పత్తి, విద్యా రంగాలలో అప్లికేషన్ల అభివృద్ధికి టీసీఎస్ సహకరిస్తుంది. ఇంజనీరింగ్ నైపుణ్యాలు , క్లైంట్ నెట్‌వర్క్‌తో పాటు స్టార్టప్‌లు ఇతర ప్రాజెక్టుల నిర్వహణలో ఎల్ అండ్ టీ సహకారం అందిస్తుంది .
క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ద్వారా అమరావతిలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయి. ఇవి ప్రధానంగా క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాలలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయింపు, రాయితీలు, ఇతర సౌకర్యాలతో ప్రముఖ సంస్థలను ఆకర్షిస్తోంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ ద్వారా హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో భవనాల నిర్మాణం జరుగుతుంది. క్వాంటం వ్యాలీలో ఒక ప్రత్యేకమైన ఐకానిక్ భవనాన్ని నిర్మించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీతో పాటు 72 కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, హెల్త్‌కేర్ సంస్థలు, ఐటీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీలో మైక్రోసాఫ్ట్ పరిశోధన కేంద్రం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం కంప్యూటింగ్ రంగంలో దేశంలో ముందంజలో నిలిపే లక్ష్యంతో ఉంది. ఐబీఎం, TCS, L&T వంటి సంస్థలతో సహకారంతో, ఈ ప్రాజెక్ట్ వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఈ ఆలోచన ఓ గేమ్ ఛేంజర్ అని ఇండస్ట్రీ వర్గాలు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాయి .